బాలయ్యకు ఎంత ఆస్తి ఉందో తెలుసా.. వివరించిన యువరత్న నమ్మలేరు

0
969

యువరత్న నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోటీ పడి మరీ నటిస్తూ ఇండస్ర్టీకి బ్లాక్ బస్టర్లు ఇస్తున్నారు బాలయ్య. సింహా, లెజెండ్, అఖండ లాంటి మూవీస్ చేస్తూ ఎప్పటికప్పుడు పాత రికార్డులను తిరగరాయం ఆయన ప్రత్యేకత. యంగ్ హీరోలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు బాలయ్య. ఈ మధ్య బాలయ్య ఆహా ఓటీటీలో ‘అన్ స్టాపబుల్ ఎన్ బీకే2’ షోకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

చాలా పెద్ద హిట్

ఇది చాలా పెద్ద హిట్ ఇచ్చింది. వివిధ రకాల ప్రముఖులను ఇందులో పరిచయం చేస్తూ వారి గతాన్ని స్రృషిస్తూ సాగిస్తున్నారు. అన్నట్లు బాటయ్య ఓ రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఇటీవల ఓ యాడ్ షూట్ లో కూడా పాల్గొన్నారు. దానికి వచ్చిన రెమ్యునరేషన్ ను తన తల్లి పేరుమీద ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు ఇచ్చారు. దాన గుణంలో కూడా బాలయ్య నిజంగా లెజెండనే చెప్పుకోవాలి.

బాలయ్య ఆస్తులు

ఇక ఆస్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2014లో హిందూపురం అసెంబ్లీకి పోటీ చేశారు బాలకృష్ణ. ఇందులో భాగంగా ఆయన ఆస్తులకు సంబంధించి ఒక అఫిడవిట్ ఇచ్చారు. తన వద్ద, తన ఫ్యామిలీ వద్ద మొత్తం రూ. 365 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా 400 గ్రాముల బంగారం, 5 కిలో గ్రాముల వెండి, ఆయన భార్య వసుంధర వద్ద 3487 గ్రాముల గోల్డ్, 300 క్యారెట్లు డైమండ్స్, 31 కిలోల వెండి, తన కుమారుడి వద్ద 220 గ్రాముల బంగారం, 17 క్యారెట్ల డైమండ్స్ వీటితో కలిపితే బాలయ్య ఆస్తి విలువ దాదాపు రూ. 325 కోట్ల వరకూ ఉంటుంది. తన పర్సనల్ గా బాలయ్యకు 169 కోట్లు, తన భార్య పేరుపై 125 కోట్లు ఉన్నట్లు వివరించారు.

నిమ్మకూరులో ఏడెకరాల సాగు భూమి

ఇక బాలకృష్ణ స్వగ్రామం నిమ్మకూరులో ఏడెకరాల సాగు భూమి, శేరిలింగంపల్లిలో రెండెకరాలు ఉందని తెలుస్తోంది. రాయదుర్గం మండలం, పవన్ మక్తాలో కూడా వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్, మాదాపూర్ లో 940 చ. అ. ఫ్లాట్ ఉన్నాయట. ఇవే కాకుండా బాలకృష్ణకు రామకృష్ణ స్టూడియోస్ లో వాటా, హెరిటేజ్ లో షేర్స్, ఇన్నోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లో 49 శాతం వాటా కూడా ఉన్నాయట. రిలయన్స్ లో కూడా కొన్ని షేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో పాటు కోటి రూపాయల విలువైన బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది.

వేగంగా వీరసింహారెడ్డి

ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ‘వీరసింహారెడ్డి’ షూటింగ్ శర వేగంగా దూసుకుపోతోంది. వచ్చే సంక్రాంతికి దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ మధ్య రీలీజైన్ ‘జై బాలయ్య’ పాట కొంత నివాశే మిగిల్చినా, ఫ్యాన్స్ కూడా పాటకు జై కొడుతున్నారు. చిత్రాన్ని ఎప్పుడు చూస్తామా అంటూ ఉత్సాహంగా ఉన్నారట బాలయ్య ఫ్యాన్స్.