బయటపడిన మనోజ్ వాట్సాప్ చాట్.. డబుల్ మీనింగే

0
862

మంచు వారి ఫ్యామిలీలో ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండయ్యేది మంచువారి ఆడబిడ్డ లక్ష్మి. మంచు మోహన్ బాబుకు ముగ్గురు సంతానం కాగా ఒక బిడ్డ, ఇద్దరు కొడుకులు. వీరిలో సోషల్ మీడియాలో లక్ష్మికి ఉన్నంత ఫాలోవర్స్ విష్ణు, మనోజ్ కు లేరు. వీరు సోషల్ మీడియాలోకి రావడం చాలా అరుదనే చెప్పాలి. ఇక మనోజ్ విషయానికి వస్తే ఆయన ఒకరున్నానే విషయం చాలా రోజులుగా ఫ్యాన్స్ తో పాటు ఇండస్ర్టీ మరిచిపోయింది. ఆయన సోషల్ మీడియాలోకి రావడమే అరుదు. ఇక ఆయనపై ఎలాంటి ట్రోల్స్ ఉండవు.

నెగెటివ్ ట్రోల్ లో మంచు మనోజ్

గతంలో నాగబాబుపై నెగెటివ్ కామెంట్లు చేసిన మనోజ్ విపరీతంగా నెగెటివ్ ట్రోల్స్ ను ఎదుర్కొన్నారు. దీంతో ఆయన సోషల్ మీడియాలో బాగా హైలట్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఆయన ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. మొదటి భార్యను విడిచిపెట్టిన మనోజ్ ప్రస్తుతం ఒంటరిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పకనే చెప్తున్నాడు. దీంతో మంచువారి ఫ్యామిలీ మనోజ్ ను దూరం పెట్టింది.

ఇటీవల రెండు సందర్భాలలో ఫ్యామిలీతో కలిసిపోదాం అనుకున్నా వారు మాత్రం దగ్గరికి రానివ్వడం లేదు. ఇటు భూమా ఫ్యామిలీలో కూడా ఇదే జరుగుతుంది. మొదటి భర్తతో కొడుకుకు జన్మనిచ్చిన భూమా మౌనికా రెడ్డి, తన వివాహ బంధాన్ని తెంపుకుంది. ఇప్పుడు మనోజ్ ను రెండో వివాహం చేసుకుంటుందని వార్తల నేపథ్యంో భూమా కుటుంబం కూడా మౌనికను పక్కన బెట్టింది.

ఫ్యామిలీకి దూరంగా మౌనిక

ఇటీవల భూమా శోభా వర్ధంతి సందర్భంగా తల్లికి నివాళులు అర్పించేందుకు మనోజ్ ను వెంట తీసుకెళ్లింది. దీంతో అక్కడికి వచ్చిన ఆమె అక్క ప్రియాంక ఆమెను పలకరించలేదు. దీంతో కుటుంబం మొత్తం ఆమెను వ్యతిరేకిస్తుందన్న వార్తలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో కడపలోని ఓ ఫేమస్ దర్గాను ఇటీవల దర్శించుకున్న మనోజ్ తన కొత్త మార్పులపై హింట్ ఇచ్చాడు. దీంతో మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తలకు కూడా బలం చేకూరింది.

డబుల్ మీనింగ్ తో హ్యూమరస్ గా

అయితే ఇటీవల ఆయన వెన్నెల కిశోర్ తో ఓ డబుల్ మీనింగ్ చాట్ చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆద్యంతం హూమరస్ గా వీరి సంభాషణ సాగిందనే చెప్పాలి. ‘నాది’‘నీది’ అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా చాటింగ్ చేశారు. ఈ చాటింగ్ ను పరిశీలిస్తే. ‘నాది ఆగ్రాలో ఉంది.. మీది ఎక్కడ ఉందీ చిచ్చా..’ అని మనోజ్ అనగా, ‘నాది హైదరాబాద్ లో ఉంది’ అంటూ వెన్నెల కిశోర్ బదులిచ్చాడు. ‘ఆగ్రా నుంచి వచ్చాక మీకీ టైమ్ ఇస్తే మీద కలుస్తాది నాది’ అని మనోజ్ చెప్పగా.. హహహహ డన్ అని కిశోర్ రిప్లయ్ ఇచ్చాడు.

మనోజ్, కిశోర్ చాటింగ్

కాసేపటి తర్వాత ‘మచ్చా నీది హైదరాబాద్ కి వచ్చిందా..?’ అని వెన్నెల కశోర్ అడగడం, ‘22 రాత్రికి వస్తుంది నాది..! లొకేషన్ మార్చింది.. సో ఇప్పుడు నాది బాన్సువాడ వచ్చింది మీకీ కలిసింది నాదీ..’ అని మనోజ్ అన్నాడు. ‘నాది ఎదురు చూస్తుంది.. నీది కోసమే’ అంటూ జిప్ ఫైల్ షేర్ చేశాడు కిశోర్. వీరి మధ్య సాగిన సంభాషనను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. నువ్వు కూడా ఇలా తయారయ్యావా మనోజ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.