రెండేళ్లుగా ఆయనపై క్రష్ ఉందట

0
613

బిగ్ బాస్ సీజన్ 6 చివరికి వస్తున్నా కొద్దీ ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ఇటీవల గేమ్ ను గెలిచిన ఇనయా సుల్తానా హౌజ్ కు కేప్టెన్ బాధ్యతలను దక్కించుకుంది. ఆమె ఒక వ్యక్తిపై క్రష్ ఉండేదట.. ఆయన కోసం రూమ్ కూడా షిఫ్ట్ చేసిందట. బిగ్ బాస్ వేదికగా ఓపెన్ అయిన ఇనయా. అవేంటో చూద్దాం.

రసవత్తరంగా సాటర్ డే షో

సీజన్ ముగింపు దశకు వస్తున్నా కొద్దీ షో రక్తి కట్టిస్తోంది. శనివారం ఎపీసోడ్ రసవత్తరంగా సాగిందనే చెప్పాలి. దీనికి హోస్ట్ నాగార్జున కూడా జత కలిశాడు. ఈ వారం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులోనే మరో కంటెస్టెంట్ ఫ్యామిలీ సభ్యులు హౌజ్ లోకి ప్రవేశించారు. శనివారం సెలబ్రెటీలతో కలిపి ఫ్యామిలీ మెంబర్స్ ను షోకు తీసుకచ్చి కంటెస్టెంట్స్ ను సర్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్.

బయటపడ్డ ఆసక్తికర విషయాలు

శనివారం ఎపీసోడ్ లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఇందులో ముఖ్యంగా కేప్టెన్ ఇనయా గురించి సీక్రెట్లు బయట పడడం విశేషం. ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఇనయా కోసం బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ సోహైల్, ఇనయా బ్రదర్ ఇమ్రాన్ తో కలిసి హౌజ్ లోకి వచ్చాడు. ఇందులో భాగంగా ఇనయాకు సంబంధించిన కొన్ని సీక్రెట్లు బయటపడ్డాయి. ఇనయాకు తను క్రష్ అని చెప్పుకచ్చాడు సోహైల్. తన కోసమే ఆమె మణికొండకు కూడా షిఫ్ట్ అయ్యిందట. తనని రోజూ కలిసేందుకు జిమ్ లో చేరిందని సీక్రెట్లు చెప్పాడు సోహైల్. తర్వాత కొన్ని రోజులకు జిమ్ కు రావడం మానేసిందట ఇనయా సుల్తానా.

వారితో క్లోజ్ ఎఫెక్ట్ తోనే

ఇనయాను కలిసేందుకు బిగ్ బాస్ హౌజ్ కు వచ్చిన సోహైల్ అప్పుడు జిమ్ ఎందుకు మానేశావు అని ప్రశ్నించగా ఇనయా సమాధానం కూడా చెప్పింది. జిమ్ లో ఇద్దరు అమ్మాయిలతో సోహైల్ చాలా క్లోజ్ గా మాట్లాడే వాడని, తాను జలసీతో మానేశానని చెప్పింది. తర్వాత కూడా సోహైల్ తో టచ్ లోనే ఉన్నానని, ఫోన్ నెంబర్ తీసుకోవాలని ప్రయత్నించినా అప్పుడు కుదరలేదని చెప్పింది. ఈ బిగ్ బాస్ వేదికగా ఫ్యామిలీ వీక్ లో నాకోసం రావడం ఆనందంగా ఉందని తబ్బిబ్బయింది ఇనయా సుల్తానా. ఆమె తమ్ముడు ఇమ్రాన్ ఇనయాలోని ఒక అలవాటు గురించి చెప్పాడు. ఆమెకు కోసం ఎక్కువైతే భోజనం చేయదని చెప్పడం విశేషం.

సోహైల్ ఏమన్నాడంటే

ఇనయాకు కలిసేందుకు వచ్చిన సోహైల్ ఆమె ఆట తీరుకు 10 మార్కులకు గానూ 8 ఇస్తానని చెప్పాడు. ఇనయాకు రేవంత్ మాత్రమే కాంపిటీషన్ కానీ, ఆదిరెడ్డి ఎట్టి పరిస్థితిలో కాడని తన అభిప్రాయాన్ని తెలిపాడు. సీజన్ చివరలో కేప్టెన్ అవడాన్ని బట్టి చూస్తే విన్నర్ గా కూడా ఇనయా సుల్తానా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సోహైల్ హీరోగా చేస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’ ఈ మూవీ డిసెంబర్ 30న విడుదల కానుందని, అందరూ తనను ఆదరించాలని బిగ్ బాస్ వేదికగా ప్రమోట్ చేసుకున్నాడు సోహైల్.