జబర్దస్త్ కు సత్యశ్రీ.. ఆయనతో విభేదాలే కారణమా..?

0
229

ఈ మధ్య ఈ టీవీ జబర్దస్త్ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంది. మల్లెమాల ప్రొడక్షన్ లో ఈ షో విశేష ప్రేక్షకాదరణ అందుకుందనడంలో సందేహం లేదు. ఇతర ఛానళ్లలో కామెడీ షోలు ఎన్ని వచ్చినా దీనికి ఆదరణ మాత్రం తగ్గడం లేదు.

వస్తుంటారు.. పోతుంటారు

ఈ టీవీలో ఈ షోను నడిపిస్తున్న మల్లెమాలకు కాంట్రవర్సీలు కొత్తకాదు. ఏదో ఒక విషయంలో వివాదాలను ఎదుర్కొంటూనే ఉంటుంది. మల్లెమాల మాత్రం వచ్చే వారు వస్తుంటారు.. పోవాలనుకునే వారు పోతుంటారు అంటూ తమ పని తాము చేసుకుపోతాం అన్నట్లుగా వ్యవహరిస్తుంది. జడ్జిగా వ్యవహరించిన నాగబాబు బయటకు వెళ్లిపోయాడు. మరో జడ్జి రోజా కూడా రాజకీయాల్లో బిజీగా ఉండడంతో షోలను చేయనని ప్రకటించింది. ఇక ఈ షో డైరెక్టర్లు నితిన్, భరత్ కొత్త షోను పెట్టుకున్నారు. నాగబాబుతో కూడా చాలా మంది కామెడీ స్టార్స్ బయటకు వచ్చారు. ఈ మధ్య కొందరు మళ్లీ జబర్దస్త్ వైపు చూస్తున్నారు. ఇన్ని రోజులు షూటింగ్ బిజీలో ఉన్న సుడిగాలి సుధీర్ తన మూవీ ‘గాలోడు’ తర్వాత మళ్లీ జబర్దస్త్ కు వెళ్తానని ప్రకటించాడు.

‘చమ్మక్ చంద్ర’ టీంలోకి సత్యశ్రీ

జబర్దస్త్ మొదలు పెట్టిన సమయంలో లేడీ ఆర్టిస్టులను కాకుండా లేడీ గెటప్ లు ఎక్కువగా కనిపించేవి. స్కిట్ కు తగ్గట్లు తన్నులు తినేందుకు అనువుగా ఉంటుందని అనేవారు టీం లీడర్స్. లేడీస్ నే పెట్టి స్కట్లను మార్చుకోవాలంటూ జడ్జిలు అప్పుడప్పుడూ సూచనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ‘చమ్మక్ చంద్ర’ టీంలోకి సత్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో గెటప్ లను చూసిన బుల్లితెర అభిమానులు లేడీనే చూస్తుండడంతో కాసింత సంతోషం వ్యక్తం చేశారు. సత్యశ్రీ ఎంట్రీకి ముందే చంద్ర స్కిట్లకు యమా క్రేజ్ ఉండేది. సత్య కామెడీ టైమింగ్, ఇద్దరి మధ్య స్కిట్ లో సఖ్యతతో చాలా స్కిట్లు కలిసి కొట్టారు. ఐతే గతంలో చమ్మక్ చంద్ర బయటకు వెళ్లడంతో ఆమె కూడా జబర్దస్త్ ను వీడింది.

స్టార్ మాలో ప్రత్యక్ష్యం

జబర్దస్త్ లాంటి షోనే స్టార్ మా ‘కామెడీ స్టార్స్’ పేరుతో కండెక్ట్ చేసింది. ఇందులో సత్యశ్రీ కనిపించింది. దీనికంటే ముందు జీ తెలుగులో ‘అదిరింది’లో కూడా ఆమె చేసింది. ఇప్పుడు లెటెస్ట్ గా జబర్దస్త్ ప్రోమోలో సత్యశ్రీ కనిపించింది. చంద్ర మాత్రం లేడు. దీంతో ఏమై ఉంటుందంటూ నెటిజన్లు తెగ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇద్దరి మధ్య విభేదాలతోనే ఆమె చంద్ర టీంను విడిచి వచ్చిందా..? అంటూ అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

తన గురువు చంద్రానే

తనలో ఉన్న ప్రతిభను గుర్తించి తనను షోకు తీసుకువచ్చింది చంద్ర కాబట్టి ఆయనే తన గురువు అని గతంలో చెప్పింది సత్యశ్రీ. ఆయన స్క్రిప్ట్ బాగుంటుందని ఆయనతో కలిసి పని చేయడం ఆర్టిస్టులకు వరమని కూడా చెప్పుకచ్చింది. మరి ఇంత చెప్పిన సత్యశ్రీ గురువును విడిచి ఎందుకు వచ్చింది. సరే ఇక్కడేమైనా స్పెషల్ టీం పెట్టి లీడర్ గా వచ్చిందంటే అదీ కాదు. తాగుబోతు రమేశ్ టీంలో కంటెస్టెంట్ గా వచ్చింది. రమేశ్ టీం పరిస్థితి షోలో గాలిలో పెట్టినదీపంగా ఉంది. ఒక్క స్కిట్టు కూడా పేలడం లేదు. మరీ ఇందులోకి సత్య రావడంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై చంద్రకానీ, సత్య కానీ ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.