మంచి స్కోప్ ఉన్న పాత్రలను రిజక్ట్ చేసిన మన తారలు.. ఎందుకు చేశారో తెలిస్తే షాకవుతారు..?

0
1273

నటీనటులకు పాత్రలు నచ్చకనో, కథ నచ్చకనో రెండూ కుదిరితే కాల్ షీట్లు లేకనో కొన్ని సినిమాలను మిస్ చేసుకుంటారు. కానీ తర్వాత తను రిజక్ట్ చేసిన పాత్రకు వచ్చిన హైప్ ను చూసి బాధపడతారు. ఇలాంటివి సినీ ఇండస్ర్టీలో సాధారణమే కానీ ఒక్కో సమయంలో ఆ పాత్ర నేను చేయాల్సింది అనుకున్నప్పుడల్లా వారి మనుసులు చివుక్కు మంటాయట. అంతటి స్కోప్ ఉన్న పాత్రను ఎందుకు మిస్ చేసుకున్నాం అంటూ ఫీలవుతుంటారట. ఇలాంటి మంచి స్కోప్ ఉన్న పాత్రలను వదులుకున్న మన నటీమణుల(హీరోయిన్స్) గురించి ఇక్కడ తెలుసుకుందాం.

మంచి పాత్రలను రిజక్ట్ మన సీనియర్ హీరోయిన్లు

మూవీస్ లో మంచి పాత్రలు దొరకడం అంత ఈజీ కాదు. ఒక వేళ అవి వెతుక్కుంటూ వచ్చినా మిస్ చేసుకుంటే వారిలో ఉండే బాధా అంతా ఇంతా కాదు. సుకుమార్ దర్శకత్వంలో రాం చరణ్ హీరోగా వచ్చిన చిత్రం ‘రంగస్థలం’ ఇందులో రంగమ్మత్త అందరికీ గుర్తుండే ఉంటుంది. యాంకర్ అనసూయ ఈ పాత్రలో నటించింది. అయితే ఈ పాత్ర కోసం మొదట రాశీని సంప్రదించారు సుకుమార్. కానీ రాశి ఈ ఆఫర్ ను రిజక్ట్ చేసింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇక రంగమ్మతగా నటించిన అనసూయకు ఈ మూవీ మంచి బ్రేక్ త్రూ అయ్యింది. తర్వాత ఆమెకు ఆఫర్లతో బిజీగా మారింది.

శ్రీదేవిని సంప్రదించారట

రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ ‘బాహుబలి’లో శివగామి పాత్రకు మొదట జక్కన్న శ్రీదేవిని సంప్రదించారట. కానీ ఆమె కొన్ని కండీషన్లు పెట్టడంతో రాజమౌళి ఆ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారట. ఇక సినిమా చూసిన వారికి తెలుస్తుంది కదా.. రమ్యకృష్ణ పర్ఫార్మెన్స్. మూవీ కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. తేజ, మహేశ్ బాబు కాంబోలో వచ్చిన చిత్రం ‘నిజం’. ఈ సినిమాలో మహేశ్ బాబు తల్లిగా మొదట జయసుధను తీసుకుందామనుకున్నారట.

లయ ఆఫర్ ను రిజక్ట్

అయితే ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో కాల్ షీట్లు అడ్జస్ట్ కాలేదు. తర్వాత ఇదే పాత్ర కోసం రేఖను కూడా అనుకున్నాట ఆమె కూడా రిజక్ట్ చేసింది. బాలయ్య బాబు చిత్రం ‘చెన్నకేశవ రెడ్డి’ బాక్సాఫీస్ సాధించింది. ఈ సినిమాలో బాలకృష్ణ చెల్లెలి పాత్ర కోసం మొదటి లయను సంప్రదించింది చిత్ర యూనిట్. చెల్లెలి పాత్రలో తాను చేయనని లయ ఆఫర్ ను రిజక్ట్ చేసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రకు బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ను సంప్రదించారు. కానీ ఆమె నటించనని చెప్పింది.

ఆ స్థానంలో రమ్యకృష్ణ

‘రాజా ది గ్రేట్’లో రవితేజ తల్లి పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించింది చిత్ర యూనిట్. ఆమె రిజక్ట్ చేయడంతో ఆదే పాత్రలో రాధిక ను తీసుకున్నారు. ఈ మూవీలో ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రజినీకాంత్ బాక్సాఫీస్ మూవీ ‘నర్సింహా’ సినిమాకు సంబంధించి నీలాంబరి పాత్ర కోసం మొదట మీనాను తీసుకుందాం అనుకున్నారట. అయితే ఆమె కొన్ని కారణాల వల్ల నో చెప్పింది. దీంతో ఆ స్థానంలో రమ్యకృష్ణను తీసుకున్నారు. మహేశ్ బాబు సినిమా ‘మహర్షి’లో హీరో తల్లి పాత్రకు సీనియర్ హీరోయిన్ జయప్రదను మొదట సంప్రదించింది చిత్ర యూనిట్. ఆమె రిజక్ట్ చేయడంతో ఆ ఆఫర్ జయసుధకు వెళ్లింది.