200 కోట్ల ప్రాజెక్ట్ కు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్.. ఇక దబిడి.. దిబిడే

0
223

ఓటీటీ షోలు, వరుస మూవీలతో దూసుకుపోతున్నారు బాలయ్య. ఆయన అభిమానులకు ప్రతీ వారం ఒక కొత్త న్యూస్ అందుతూనే ఉంది. బాలయ్యా మాజాకా.. ఆయన ఏది చేసిన ట్రెండ్ సెట్టరే అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత కాలం కూడా ఆయనకు కలిసి వస్తుంది. బాలకృష్ణ ఇటీవల ఒక యాడ్ లో కూడా నటించారు. ఒక డెవలపర్ సంస్థను చేసిన యాడ్ కు వచ్చిన డబ్బులను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు అందజేశారు బాలకృష్ణ. దాన గుణంలోనూ ఆయన మహారాజనే చెప్పాలి. ఆయితే ఆయన ఇప్పటి వరకూ చేసిన సినిమాలు అన్నీ కూడా పరిమిత బడ్జెట్ లోనే.

యంగ్ స్టార్లకు ధీటుగా

ఇప్పుడున్న యంగ్ స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలు కోట్లాది రూపాయల బడ్జెత్ కూడుకున్నవి కానీ బాలయ్య మాత్రం ఇప్పటి వరకూ రూ. 100 కోట్లకు పైబడిన బడ్జెట్ ఉన్న సినిమాలలో నటించలేదు. కానీ తాజాగా ఆయన వద్దకు ఒక ప్రాజెక్టు వచ్చింది. భారీ బడ్జెత్ తో ఉన్న ప్రాజెక్టులో చేసేందుకు బాలయ్య బాబు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. ఈ ప్రాజెక్టు వివరాలను ప్రముఖ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ వెల్లడించారు. బాలయ్య బాబు అంటే అన్ని విషయాల్లో బంగారమే అంటూ ఆయన చెప్పుకచ్చాడు.

ప్రాజెక్టు చేపట్టనున్న ప్రొడ్యూసర్ కళ్యాణ్

ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మాణంలో ఇంటర్నేషన్ ప్రాజెక్టు ఒకటి రూపుదిద్దుకోబోతోంది. రామానుజాచార్య మూవీని తెరకెక్కించనున్నట్లు కళ్యాణ్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి అంటూ చెప్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మూవీ ఉండబోతోందని, ఈ మూవీలో బాలయ్య బాబు భాగమైతే బాగుంటుందని భావించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం ఇటీవల యువరత్న ను సంప్రదించగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు. బాలయ్య బాబు ఉంటే రికార్డులు బద్ధలవడం ఖాయమన్నారు.

రూ. 200 కోట్ల ప్రాజెక్టులో బాలయ్య ఎంట్రీ

చిన జీయర్ స్వామి, రవి కొట్టారకర సంస్థలు కూడా ఇందులో భాగమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసిన బాలయ్య అభిమానుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికి సీ కళ్యాణ్ ప్రొడక్షన్ లో బాలకృష్ణ రూ. 200 కోట్ల ప్రాజెక్టుకు సైతం చేయడం ఇండస్ర్టీలో పతాక చర్చకు దారి తీసింది. దీంతో బాలయ్య రికార్డులు బద్దలు కొట్టనున్నారని టాలీవుడ్ చర్చించుకుంటోంది. ఈ సినిమాలో ఆయన సక్సెస్ అయితే ఇక ఆయనను ఢీ కొట్టే వారే లేరని చెప్పడంలో సందేహం ఎంతమాత్రం లేదు.

పార్కు ఏర్పాటుకు సహకరిస్తామన్న సీఎం

ఈ ప్రాజెక్టు కోసం రూ. 200 కోట్లతో ఒక పార్కును నిర్మిస్తున్నామని కళ్యాణ్ చెప్పుకచ్చారు. ఈ ప్రాజెక్టు చేయడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిక్ కూడా అన్నారు. సీఎంగా ఆయన ఈ ప్రాజెక్టు ముందుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఇందులో సంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆహారం అన్నీ ఉంటాయని కళ్యాణ్ చెప్పారు. దీనిలో వింతలపై ఇప్పుడు ఇండస్ర్టీలో చర్చ జరుగుతోంది.