మంచు వారి ఫ్యామిలీకి కాలం కలిసి రావడం లేదు. మంచు మోహన్ బాబు ఇండస్ర్టీలో మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నారు. విలన్ గా, హీరోగా, ప్రొడ్యూసర్ గా కూడా రాణించారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం వెనకే ఉండిపోయారు. మంచు లక్ష్మి వివిధ విభాగాల్లో కష్టపడినా రాణించలేకపోయారు. ఇద్దరు కొడుకులు మాత్రం వరుస ప్లాపులు, డిజస్టర్లతో రాణించలేకపోతున్నారు.
కుటుంబానికి దూరంగా ఉంటున్న మనోజ్
ఇటీవల వీరి కుటుంబంలోని మనోజ్ ను అందరూ దూరం పెట్టినట్లు వార్తలు వ్యాపించారు. ఆయన అన్న పుట్టిన రోజున మనోజ్ విషెస్ పెట్టినా ఆయన స్పందించలేదు. తర్వాత అన్న ట్విన్ డాటర్స్ పుట్టిన రోజున బాబాయిగా విషెస్ చెప్పినా విష్ణు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను దూరం ఉంచుతున్నారని ఇదంతా తన రెండో పెళ్లి నేపథ్యంలోనే అంటూ వార్తలు సైతం ఇండస్ర్టీలో హల్ చల్ చేస్తున్నాయి.
మొదటి భార్యకు విడాకులు
మనోజ్ గతంలో ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే వారి మధ్య విభేదాలు రావడంతో ఆయన ఆమెతో విడాకులు తీసుకున్నారు. అటు మనోజ్ మొదటి భార్య అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకుంటూ సెటిలైపోయిందని తెలిసింది. అప్పటి నుంచి మనోజ్ మాత్రం ఒంటిరిగా ఉన్నాడు. ఈ మధ్య రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. ఆయన తీసుకున్న డెషిజన్ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తాయని అందుకే మనోజ్ కుటుంబంతో కాకుండా ఒంటరిగా ఉన్నాడని ఇండస్ర్టీ చెప్పుకచ్చింది.
రెండో పెళ్లిపై హింట్
అయితే మంచు మనోజ్ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా మౌనికతో కొన్ని రోజులుగా రిలేషన్ లో ఉన్నాడని గతంలో వార్తలు కూడా వచ్చాయి. భూమా మౌనికతో కలిసి మనోజ్ వినాయక చవితి రోజు పూజల్లో కూడా పాల్గొన్నాడు. మనోజ్, మౌనిక రిలేషన్ లో ఉన్నారన్న విషయాన్ని ఈ ఘటనతో చెప్పకనే చెప్పింది ఈ జంట. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన తన రెండో పెళ్లిపై హింట్ కూడా ఇచ్చారు.
కొత్త జీవితంతో ముందుకు వస్తానన్న మనోజ్
మంచు మనోజ్ ఇటీవల కడపలోని ఫేమస్ దర్గాకు వెళ్లాడు. అక్కడ ఆయన మాట్లాడాడు. ‘ఇప్పటి వరకూ ఈ దర్గాకు మా ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులతో పాటు నా సన్నిహితులు కూడా వచ్చారు. కానీ నేను రావడం ఇదే మొదటి సారి. ఇక్కడికి రావడానికి నాకు చాలా సమయమే పట్టింది. కెరీర్ ను మళ్లీ గాడిలో పెట్టాలని అనుకుంటున్నా. త్వరలో మంచి సనిమాతో మీ ముందుకు వస్తాను. కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించబోతున్నాను.’ అంటూ చెప్పుకచ్చాడు. ఇక ఆయన మాటలను పట్టి చూస్తే తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ తెలుస్తుంది.
త్వరలోనే సెట్స్ పైకి
పరోక్షంగా హింట్ ఇచ్చారనే అనిపిస్తుంది. వీరి పెళ్లి డేట్ ను కూడా త్వరలోనే ప్రకటిస్తారు కావచ్చు. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే ఆయన ఒక ప్రాజెక్టుపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయట. తర్వలోనే మంచి హిట్ తో వస్తానని మనోజ్ జోస్యం కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా మంచువారింట్లో కలతలు తగ్గి అందరూ బాగుండాలని అభిమానులు కోరుకుంటున్నారు.