మేల్ యాంకర్లలో ఎవరి రెమ్యునరేషన్ ఎంత.. తెలుసుకుంటే షాకవుతారు

0
549

ఏ ఈవెంట్ అయినా, షో అయినా యాంకర్ లేకుంటే చేయలేం. ఇందులో ఫిమేట్ యాంకర్లు మనకు ఎక్కువగా కనిపిస్తారు. వారి అందం, మాటలతో కట్టి పడేస్తారు. కన్నడియన్ అయినా సుమ చక్కటి అందం, పంచ్ డైలాగులతో ఇండస్ర్టీలో యాంకర్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. తర్వాత వచ్చిన యాంకర్లు కూడా అదే బాటలో రాణించారు.

సుమకంటే ముందు తరం వారు యాంకర్లుగా పెద్దగా నిలదొక్కుకోలేక పోయారు. కానీ చాలా కాలంగా ఈ రంగంలో సుమ ఇటు షోలు, అటు ఈవెంట్లు చేస్తూ మెప్పిస్తున్నారు. తర్వాతి వరుసలో అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, సౌమ్యారావు, ఇలా చాలా మందే ఉన్నారు. క్రమ క్రమంగా తారలుగా మంచి రోల్స్ చేస్తూ వెండితెరపై కూడా అలరిస్తున్నారు.

మేల్ యాంకర్లు తక్కువే

చాలా గ్లామర్ గా కనిపించే ఫిమేల్ యాంకర్లతో పాటు ఇండస్ర్టీలో మేల్ యాంకర్లు కూడా కొనసాగుతున్నారు. వీరు కూడా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ, ఇప్పుడు హీరోలుగా కూడా దర్శనమిస్తున్నారు. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాలంటే ప్రదీప్, రవి, సుధీర్ ఉన్నారు. వీరి షోలకు మంచి వ్యూవర్ షిప్ ఉంటుంది. ఇందులో ప్రదీప్, సుధీర్ ప్రస్తుతం హీరోలుగా కూడా వెండితెరపై రాణిస్తున్నారు. వీరు కాకుండా ఇంకొంత మంది ఉన్నా వారికి సరైన గుర్తింపు లభించలేదు. సుడిగాలి సుధీర్ ఇటీవల ‘గాలోడు’ సినిమాలో హీరోగా మంచి నటనను ప్రదర్శించారు. ఇండస్ర్టీలో కూడా గాలోడికి మంచి టాక్ ఉంది.

ముగ్గురు యాంకర్ల గురించి

ఫీమేల్ యాంకర్లు ఎక్కువ మంది ఉన్నా. ముందు వరుసలో నిలుచునే వారు కొందరే ఉన్నారు. వీరు ఒక్కో ఈ వెంట్ కు దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకూ రెమ్యునరేషన్ గా తీసుకుంటారు. ఎడా పెడా ఈవెంట్లు, షోలు చేస్తూ బగా సంపాదిస్తున్నారు కూడా. కానీ ఈ విషయంలో మేల్ యాంకర్లు వెనుబడ్డారనే చెప్పుకోవాలి. వీరికి వారంత పారితోషికం దక్కకున్నా తక్కువ మందే ఉన్నారు కాబట్టి ఎక్కువ షోలలో కనిపిస్తుంటారు. ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారో ఇక్కడ చూద్దాం.

లీడ్ లో ప్రదీప్

ప్రదీప్, రవి, సుధీర్ యాంకర్లుగా ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రదీప్ ఒక్కో ఈవెంట్ కు రూ. 5లక్షలు తీసుకుంటారట. ఇక సుధీర్ విషయానికి వస్తే రూ. 4 లక్షలు, రవి రూ. 3 లక్షలు తీసుకుంటున్నారట. సుధీర్ సినిమాల్లో బిజీగా మారుతున్నారు కాబట్టి రెండు చేతులా సంపాదించగలుగుతున్నారు. ఇప్పటి వరకూ ఒక్క సినిమాలోనే హీరోగా చేసిన ప్రదీప్ ఇంకా వెండితెరపై నిలదొక్కుకోలేదు.

ఇండస్ర్టీలో ఎక్కువ పారితోషికం

ఇక రవి విషయానికి వస్తే ఇప్పటికీ కో ఆర్టిస్టుగా మాత్రమే కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు మేల్ యాంకర్ లలో ఇండస్ర్టీలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నది మాత్రం ప్రదీప్ మాచిరాజు అనే చెప్పాలి. సుధీర్ మెల్లగా వెండితెరపైకి వెళ్తుండగా, రవి మాత్రం ఇంకా యాంకర్, వెండితెరపై చిన్న చిన్న పాత్రలు స్థానంలోనే కొనసాగుతున్నారు.