ఇండస్ర్టీలో ప్రకంపణలు పుట్టిస్తున్న పవన్ లేడీ ఫ్యాన్ లెటర్

0
21

తన హీరో కోసం అభిమానులు ఎంతదూరానికైనా వెళ్తారు అనే దానికి ఈ సంఘటన చక్కటి ఉదాహరణ. తమ హీరో ఇమేజ్ ను నాశనం చేసేందుకే ఆ డైరెక్టర్ అతనితో సినిమా తీస్తున్నాడని ఓ అభిమాని చేసిన పని ఇప్పుడు ఇండస్ర్టీని వణికిస్తుంది. డైరెక్ట్ గా ఆయన రాసిన లేఖ ఒకటి నెట్టింట్లో దుమారం రేపుతోంది. మా హీరోతో ఆ సినిమాను చేయవద్దంటూ అతడు లేఖలో పేర్కొనడం చూసి అందరూ షాక్ తిన్నారు.

తమిళ్ రిమేక్ కు ప్లాన్

డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే వారంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక ప్రకటన కూడా చేసింది. అయితే వీరి కాంబోలో మూడేళ్ల క్రితం ప్రకటించిన ‘భవదీయుడు భగత్ సింగ్’ విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. దాదాపు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు కూడా తెలుస్తోంది. అయితే వీరి కాంబోలో మరోలో ఓ తమిళ రిమేక్ చేయనున్నట్లు ఇండస్ర్టీ వర్గాల నుంచి ఒక వార్త లీకైంది.

రిమేక్ వద్దంటున్న అభిమానులు

హరీశ్ శంకర్, పవన్ కాంబోలో వచ్చే రీమేక్ గురించి అనౌన్స్ వెలువడడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేషనల్ లెవల్ ట్రెండ్ చేశారు. అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మాకు మా అభిమాన హీరోతో రీమేక్ అవసరం లేదని పైగా అది ఇప్పటికే డబ్బింగ్ తో కూడా ఓటీటీలో ఉందని దాన్ని రీమేక్ చేసి పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే ఆయన ఇమేజ్ మొత్తం పోతుందంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘తేరి’ వార్తలో ఫ్యాన్స్ లో కలకలం

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘తేరి’. ఈ మూవీనే రీమేక్ చేసి అందులో పవన్ కళ్యాణ్ ను హీరోగా పెట్టి హరీశ్ శంకర్ సినిమా తీయబోతున్నాడన్న వార్తను పవన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తేరి ఇప్పటికే తెలుగులో కూడా డబ్ అయి ఓటీటీలో కూడా స్ర్టీమింగ్ అవుతుంది. ఈ రీమేక్ వద్దంటూ చెప్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన ట్రోల్స్ లక్షకు పైగా ట్వీట్స్ తో టాప్ 1లో ట్రెండ్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాకు సంబంధించి ఒక లేడీ ఫ్యాన్ సూసైడ్ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపణలే సృష్టించింది.

సూసైడ్ లేఖ

డైరెక్టర్ హరీశ్ శంకర్, ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్ పేరిట ఈ లెటర్ రాసింది. లెటర్ లో ఏముందంటే ‘సార్.. నేను ఇంత వరకూ ఎప్పుడూ లెటర్ రాయలేదు. మొదటి లెటర్ నా సూసైడ్ లెటరే అవుతుందని అనుకోలేదు కూడా.. ఎన్ని రీమేక్స్ వచ్చినా చూస్తూ ఉండిపోయాను. కానీ మా అభిమాన హీరోతో తేరి రిమేక్ అని తెలిసిన తర్వాత లెటర్ రాయక తప్పలేదు. నా చావుని చూసైనా రిమేక్ ఆలోచన విరమించుకోవాలి. అలా కాదని రిమేక్ చేస్తే మాత్రం నా చావుకు డైరెక్టర్, మైత్రీ మూవీ మేకర్సే బాధ్యత వహించాల్సి ఉంటుంది’. అని చెప్పింది. ఆ అమ్మాయి రాసిన లెటర్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ర్టీలో ప్రకంపణలు పుట్టిస్తోంది.