చిరు సిగరెట్‌ కృష్ణంరాజుగారి జేబులో

0
303
megastar chinjeevi

మెగాస్టార్‌ చిరంజీవి… స్వయంకృషితో టాలీవుడ్‌ బిగ్‌బాస్‌గా మారిన కష్టజీవి. కెరీర్‌ ప్రారంభం నుంచి చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చినా.. ఇంతింతై అన్నట్టుగా తన నట విశ్వరూపాన్ని చూపించి ఇప్పటికీ టాలీవుడ్‌ బాక్సాఫీస్‌కా బాద్‌షాగా వెలుగొందుతున్నారు. చిరంజీవి సినిమా ఒకప్పుడు లక్షల్లో ఉండే బిజినెస్‌ కోట్లకు చేరింది. ఆ కోట్ల నుంచి ఇప్పుడు వందల కోట్లకు ఎగబాకింది.

నటుడిగా చిరంజీవి సినా రంగ ప్రవేశం చేసే నాటికి తండ్రి వెంకట్రావు గారి సంపాదన మీదే ఇల్లు మొత్తం గడుస్తుండేది. మద్రాసులో వేషాల కోసం ప్రయత్నాలు చేస్తున్న చిరంజీవి ఖర్చులకు కూడా ఆయనే డబ్బు పంపేవారు. దీంతో వచ్చిన ప్రతి రూపాయినీ పాపాయిలా చూసుకుంటూ ఖర్చుపెట్టుకునేవారు చిరంజీవి. ఈ క్రమంలోనే ఆయన పిసినారి అనబడే పొదుపరిగా మారిపోయారు.

megastar chinjeevi

యశోద హాస్పిటల్స్ లో చిరంజీవి

మెల్లగా తన స్వంత సంపాదన మొదలైన తర్వాత కూడా ఆయన డబ్బు విషయంలో అదే జాగ్రత్తలను పాటిస్తూ వచ్చారు. అప్పట్లో చిరంజీవికి సిగరెట్‌ కాల్చే అలవాటు ఉండేది. దీంతో ఆయన దీని కోసం కొంత సొమ్మును కేటాయించుకునేవారు. ప్రారంభంలో అప్పుడప్పుడూ ఒకటీ అరా సిగరెట్‌లు కాల్చే ఆయన సినిమాల్లో బిజీ కావడంతో ఆ టెన్షన్‌ తట్టుకోవటానికి కొద్దిగా ఎక్కువగా సిగరెట్‌లు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.

విడిగా ఒకటీ, రెండు కొనే స్థాయి నుంచి పెట్టెలు కొనే స్థాయికి వచ్చారు. దీంతో ఈ ఖర్చు పెరిగిపోయింది. ఇది గమనించిన ఆయన దీనికి ఎలాగైనా ఒక పరిష్కారం వెతకాలి అనుకున్నారు. అప్పటికి ఆయనకు కృష్ణంరాజుగారు అని ఒక మిత్రడు ఉండేవారు. ఈయన సారధి స్టూడియో నూతన యాజమాన్యానికి సన్నిహితులు. ఎప్పుడూ ఆయనతోనే ఉండేవారు. చిరంజీవి తన సిగరెట్‌ ప్యాకెట్‌ను ఆయన జేబులో ఉంచమని ఇచ్చేవారు.

తనకు సిగరెట్‌ కాల్చాలి అనిపించినప్పుడు వచ్చి ఆయన దగ్గర తీసుకుని కాల్చేవారు. ఓరోజు కృష్ణంరాజుగారు.. నా దగ్గర పెట్టడం దేనికి నీ జేబులోనే పెట్టుకుంటే గొడవ ఉండదు కదా అన్నారట. దానికి చిరంజీవి ‘‘చూడు రాజు నా దగ్గర ఉందను నేను మాటి మాటికీ కాల్చేస్తూ ఉంటాను. దానివల్ల ఖర్చు పెరిగిపోతుంది.

అదే నీ దగ్గర ఉందనుకో మాటి మాటికీ నిన్ను అడగాలంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంద కాబట్టి ఎప్పుడో ఒకసారి అడుగుతాను’’ అన్నారట. అలా రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఎదిగారు చిరంజీవి. అందుకే ఇప్పటికీ ఆయన తన ఇంట్లో అందరికీ పొదుపు గురించి క్లాస్‌ పీకుతూ ఉంటారట.