యశోద హాస్పిటల్స్ లో చిరంజీవి

0
310
chiranjeevi in yashoda hospital

రీసెంట్ గానే కేసీఆర్ బాత్రూం లో కాళ్ళు జారీ క్రిందపడి యశోద హాస్పిటల్స్ లో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే సర్జరీ ని పూర్తి చేసుకున్న కేసీఆర్ కొద్దిరోజులు డాక్టర్ల పర్యవేక్షణ లోనే యశోద హాస్పిటల్స్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కనీసం 8 నెలల సమయం పడుతుంది అట. అప్పటి వరకు ఆయన విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి రాజకీయ కార్యకలాపాల్లో ఆయన్ని ఇప్పట్లో మనం చూడలేమనే చెప్పాలి.

అయితే కేసీఆర్ కి ఇలా జరిగింది అనే విషయం తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు మరియు సినీ తారలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. రీసెంట్ గానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కేసీఆర్ ని యశోద హాస్పిటల్స్ లో కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

chiranjeevi in yashoda hospital

రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!

నిన్న మెగాస్టార్ చిరంజీవి కూడా కేసీఆర్ ని కలిసాడు. మొదటి నుండి కేసీఆర్ కుటుంబం తో చిరంజీవి కి మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి యశోదా హాస్పిటల్స్ కి రాగానే కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆహ్వానం పలికి లోపలకి తీసుకెళ్లాడు. అనంతరం చిరంజీవి కేసీఆర్ ని కలిసి ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అలాగే కేసీఆర్ కూడా చిరంజీవి బాగోగులు గురించి అడిగి తెలుసుకున్నాడు. అలా దాదాపుగా ఒక 45 నిమిషాల పాటు కేసీఆర్ తో మాట్లాడాడట చిరంజీవి. ఇండస్ట్రీ నుండి కేవలం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే యశోద హాస్పిటల్స్ లో కేసీఆర్ ని ప్రత్యక్షంగా కలిసి బాగోగులు గురించి కనుక్కున్నాడు. కానీ మిగిలిన వాళ్ళు ఇప్పటి వరకు కలవలేదు.

అధికారం లో ఉన్నప్పుడు ప్రతీ చిన్న విషయానికి కేసీఆర్ మరియు కేటీఆర్ కి కృతఙ్ఞతలు తెలిపి ఎంతో విధేయత చూపించే మన టాలీవుడ్ సెలెబ్రిటీలు ఇలా అకస్మాత్తుగా కేసీఆర్ ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. ఇక రాజకీయ పరంగా చూసుకుంటే కేసీఆర్ కి సన్నిహితంగా ఉంటూ వస్తున్న మన ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకు కేసీఆర్ ని కలవలేదు, మరోపక్క కేటీఆర్ తో ఎంతో సన్నిహితంగా ఉండే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇంకా కేసీఆర్ ని కలవలేదు.