పవన్ కళ్యాణ్ కాదు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని

0
275
Pawan Kalyan Sensational Words AP Cm Candidate

రీసెంట్ గానే తెలంగాణాలో ఎన్నికలు ముగిసాయి. పదేళ్ల పాటు అధికారం లో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ ని క్రిందకి దించి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. వైసీపీ పార్టీ పై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, టీడీపీ మరియు జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా ఓడిపోతాము అనేది వైసీపీ పార్టీ కి అంతర్గత సర్వేల ద్వారా తెలిసింది.

పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు కూడా అధికారికంగా పొట్టుని ప్రకటించడం తో ఇక వార్ వన్ సైడ్ అయ్యినట్టు చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు. కానీ ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏమిటంటే ఈ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని. రెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటాడు, మరో మూడు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉంటాడు అనేది చాలా రోజుల నుండి సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త.

Pawan Kalyan Sensational Words AP Cm Candidate

జగన్ కి తలనొప్పిగా మారిన రేవంత్ రెడ్డి

కానీ రాజమండ్రి జైలు నుండి బయటకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తీరుని చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ కి సీఎం సీట్ షేర్ ఇవ్వడానికి సిద్ధం గా లేడు అనే సంకేతాలు బయటకి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన ప్రతీ మీటింగ్ లోను టీడీపీ – జనసేన ప్రభుత్వం వస్తుంది అని అంటుంటే, చంద్రబాబు నాయుడు మాత్రం మరో మూడు నెలల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది అంటూ చెప్పుకొని తిరుగుతున్నాడు.

ఇక్కడే వీళ్లిద్దరి మధ్య కో ఆర్డినేషన్ కుదరడం లేదు. మొన్న వైజాగ్ లో జరిగిన పవన్ కళ్యాణ్ సభలో అభిమానులందరూ సీఎం సీఎం అని అరుస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ వారికి సమాధానం చెప్తూ ‘ముందు మనం పోటీ చేసే స్థానాల్లో సంపూర్ణ మెజారిటీ తో ఓట్లు వేసి గెలిపించండి, మనం మద్దత్తు ఇచ్చిన స్థానాల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులకు కూడా భారీ మెజారిటీ ఇవ్వండి.

అప్పుడు నేను ముఖ్యమంత్రి పదవి గురించి చంద్రబాబు గారితో చర్చిస్తాను. అంతే కానీ ఏమి లేకుండా ముందుగానే సీఎం సీట్ ని ఆశించడం కరెక్ట్ కాదు’ అంటూ సమాధానం ఇచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు అనేది అభిమానులకు అర్థం అయితే, వాళ్ళ ఓటు కూటమికి పడడం చాలా కష్టం అనే చెప్పాలి. చూడాలి మరి ఈ కూటమి కి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది.