తిరుగులేని శక్తులుగా మారిన మల్లా రెడ్డి, అల్లుడు

0
133
Malkajgiri Brs Candidate Minister Mallareddy Son in Law

వ్యాపార రంగం లో దిగ్గజాలు గా ఎదిగిన వ్యక్తులు మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు మల్లా రెడ్డి. వీళ్ళిద్దరూ మామా అల్లుళ్ళు అనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరూ కూడా ప్రతికూల రాజకీయ పరిస్థితులలో ఎమ్యెల్యేలు గా గెలిచిన వారే. మేడ్చెల్ మండలం మైసమ్మ గూడా, కండ్ల కోయ శివార్లలోని బోయినపల్లి సూరారంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఫంక్షన్ హాల్స్, మెడికల్ కాలేజీలు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు చేసి మేడ్చెల్ లో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

పవన్ కళ్యాణ్ కాదు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని

ఇక తన మామయ్య మల్లా రెడ్డి పక్కనే ఉంటూ ఈ వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ మామ చాటు అల్లుడిగా మర్రి రాజశేఖర్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నాడు. 2014 వ సంవత్సరం లో మల్లా రెడ్డి టీడీపీ పార్టీ లో చేరి మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుండి ఎంపీ గా గెలుపొందాడు. ఆ తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ లో చేరాడు.

Malkajgiri Brs Candidate Minister Mallareddy Son in Law

2018 అసెంబ్లీ ఎన్నికలలో మేడ్చల్ టికెట్ ని సంపాదించి, ఎమ్యెల్యే గా ఎన్నికై మంత్రిగా కూడా పని చేసాడు. అదే సమయం లో తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కి మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ ఇప్పించి బీఆర్ఎస్ తరుపున పోటీ చేయించాడు. అయితే కాలం కలిసిరాక అల్లుడు ఓడిపోయినప్పటికీ కూడా మేడ్చల్ ని కేంద్రం గా చేసుకొని తన అల్లుడితో రాజకీయం చేయించాడు.

లోకల్ రాజకీయాలు అల్లుడికి బాగా అబ్బేలాగా చేసి, మల్కాజ్ గిరి స్థానం కి ఇంచార్జి ని కూడా చేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా తన అల్లుడిని మల్చుకున్నాడు. మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా మామ చాటు అల్లుడు అనే ట్యాగ్ నుండి బయటపడేందుకు, రాజకీయం గా వచ్చిన ప్రతీ అవకాశం ని సద్వినియోగ పర్చుకునేందుకు చాలా కష్టపడ్డాడు.

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మల్కాజ్ గిరి సీట్ నుండి పోటీ చేసి భారీ మెజారిటీ తో గెలుపొందాడు. మరోపక్క మల్లా రెడ్డి కూడా మేడ్చల్ లో ఎమ్యెల్యే గా గెలిచి మరోసారి తన సత్తా చాటాడు. వీళ్లిద్దరు ఈ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ఏకంగా 5 నియోజకవర్గాల్లో తమ పట్టుని సాధించారు. అలా పదేళ్లలో మామ అల్లుళ్ళు రాజకీయ పరంగా మేడ్చల్ మరియు మల్కాజ్ గిరి ప్రాంతాలలో తిరుగులేని శక్తులుగా మారారు.