జగన్‌ అలాచేస్తే బాబుకు పవన్‌ రాం రాం

0
423
jagan pawan kalyan

పవన్‌ కల్యాణ్‌… అభిమానులందరూ ఆయన్ను పవర్‌స్టార్‌ అని అభిమానంగా పిలుచుకుంటారు. రాజకీయ పార్టీ అధినేతగా ఆ పార్టీ కేడర్‌ జనసేనాని అని పిలుచుంటారు. కానీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారు మాత్రం ఆయన్ను ‘ప్యాకేజీస్టార్‌’ అంటుంటారు. సరే రాజకీయంగా అనేక విమర్శలు ఒకరిపై ఒకరు చేసుకోవడం సహజమే.

అసలు పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ తీసుకోవడం వైసీపీవారు 2014 నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడైనా చూశారా?. పోనీ 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారపీఠంపై కూర్చున్నది వైసీపీనే కాబట్టి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పవన్‌ కల్యాణ్‌కు అందిన ప్యాకేజీకి సంబంధించిన లెక్కల బొక్కలు కనిపెట్టగలిగారా? ఎందుకంటే పవన్‌ మీద వీరు చేసేది వందల కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకున్నాడని.

jagan pawan kalyan

రూ.10 తో పది లక్షలు కొల్లగొట్టిన బాలయ్య ..!

అన్ని వందల కోట్ల రూపాయలను సమకూర్చడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పోనీ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్నట్లు దొడ్డిదారి కంపెనీలు పవన్‌కు ఏవీ లేవాయె. మరి ప్యాకేజీ సొమ్ము ఎలా అందుతోంది? దీనికి సమాధానం చెప్పమని పవన్‌ కల్యాణే పలుమార్లు వైసీపీకి సవాల్‌ కూడా విసిరారు. అయినా అటు నుంచి గప్‌చుప్‌.

తాజాగా నారా లోకేష్‌ యువగళం ముగింపు సభను విజయనగరం జిల్లాలో నిర్వహించటానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది తెలుగుదేశం పార్టీ. తన సినిమాల షెడ్యూల్స్‌ వల్ల తాను హాజరు కావడంలేదని పవన్‌ ముందు ప్రకటించారు. దాంతో వైసీపీ సోషల్‌ మీడియా, సాక్షి పత్రిక అదిగో పవన్‌ మీ తెలుగుదేశం సభకు నేను రాను అంటూ అప్పుడే అలక మొదలు పెట్టాడు అని రాశారు.

తీరా నిన్నటికి నిన్న పవన్‌ తాను హాజరవుతున్నట్లు ప్రకటించారు. దీనికి మళ్లీ అదే మీడియా పవన్‌కు భారీగా ప్యాకేజీ ముట్టింది అందుకు ఆ సభకు వస్తున్నాడు అంటున్నారు. అసలు పవన్‌ అనేవాడు ప్యాకేజీకి అమ్ముడుపోయే వ్యక్తి అయితే.. జగనే అతన్ని ఎంతోకొంత ప్యాకేజీకి మాట్లాడుకుని చంద్రబాబుకు మద్దతు ఇవ్వకుండా అపవచ్చు కదా.. ఈ మాత్రం చిన్న విషయాన్ని ఎందుకు పెద్దగా చేస్తున్నారు.