పవన్ కళ్యాణ్ కి మళ్ళీ మూడొచ్చిందోచ్..!

0
1211

అధికార పక్షాల్లో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క జగన్ పై నే విమర్శలు చేస్తూ ఉంటాడు. చంద్రబాబు దత్తపుత్రుడిగా జగన్ వర్గం చెబుతున్నట్టుగా.. చంద్రబాబుని పల్లెత్తు మాట అనడు. ఇక తాజగా సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడుడప్పుడు 3 నెలలకో, 6 నెలలకో రాజకీయాలపై మూడు వస్తుంది. అలా మూడు వచ్చి రాగానే జగన్ పై విమర్శలు చేస్తాడు. ఇది గత 8 ఏళ్లుగా జరుగుతున్న తంతు.

సినిమాల్లో కాస్త విశ్రాంతి దొరగ్గానే

అటు సినిమాలు చేయాలో, లేక రాజకీయాల్లో ఉండాలో తెలియక తికమక పడుతున్న పవన్ కళ్యాణ్.. మరో సారి రాజకీయాలపై ద్రుష్టి పెట్టాడు. సినిమాల్లో కాస్త విశ్రాంతి దొరగ్గానే జగన్ గుర్తుకు వస్తాడో ఏమో గానీ.. జగన్ పై విమర్శలు చేస్తాడు. అందులో భాగంగానే మరో సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పై విమర్శలు గుప్పించాడు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఏమాత్రం జరగడం లేదని హైదరాబాద్ లో షూటింగ్ లు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ అన్నారు.

అప్పుల బాట పట్టించారని

ఎపి నుండి 151 మంది ఎమ్మెల్యేలు, 22మంది లోక్ సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యుల బలం వైసిపికి ఉందని అన్నారు. ఇంత బలం ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది పోయి.. అప్పుల బాట పట్టించారని మండి పడ్డారు. కక్ష సాధింపు రాజకీయాలతో తప్పుడు కేసులు పెడుతున్నారని.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేక చేతులు ఎత్తేశారని అన్నారు.

జగన్ పై విమర్శలు

రేట్లు పెంచి ఇసుకను అడ్డగోలు దోచుకొంటున్నారని.. వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసి, సాగు మోటార్లకు మీటర్లు పెడుతున్నారని చెప్పారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని.. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికేసి అక్రమ రవాణా చేస్తున్నారని జగన్ పై విమర్శలు గుప్పించాడు.