పెళ్లైన మూడు నెలలకే కవలలకు జన్మ ఇచ్చిన నయనతార

0
1356

ఇటీవలే నయనతార, విగ్నేష్ దంపతుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి జరిగిన మూడు నెలలకే నయనతార దంపతులు కవల పిల్లలకు జన్మిచ్చారు. ఇద్దరూ మగ పిల్లలే కావడం విశేషం. అయితే పెళ్లి జరిగి మూడు నెలలు మాత్రమే అయింది. కనీసం నయనతార కి కడుపు వచ్చినట్లు కూడా వార్తలు రాలేదని అందరూ ఆశ్చర్య పోతున్నారు. అయితే.. అక్కడే ఓ విషయం చెప్పకనే అందరికి అర్ధం అవుతుంది.

సోషల్ మీడియాలో ప్రకటన

ఈ దంపతులు ఇద్దరూ సరోగసీ పద్దతిలో తల్లి తండ్రులు అయ్యారని అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని వారు బయటికి వెల్లడించక పోయినా తెలుస్తుంది. అయితే కవలలకు జన్మ ఇచ్చిన విషయాన్ని మాత్రం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు వారి సోషల్ మీడియాలో ప్రకటించారు. అంతే కాదు.. పుట్టిన పిల్లల పాదాలకు ముద్దు పెడుతూ ఫోటో కూడా పోస్ట్ చేశారు.

పిల్లలకు పేర్లు కూడా పెట్టారు

వారి ఫోటో కి కాప్షన్ కూడా జోడించారు. నయన్, నేను తల్లి తండ్రులము అయ్యాము. మాకు ఇద్దరు మగ కవలలు జన్మించారు. మా పూర్వీకుల ఆశీర్వాదాలు, మా ప్రార్ధనల పుణ్యాన్ని అంతా కలుపుకొని ఇద్దరు పిల్లలు పుట్టారు. మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. అని నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆ పిల్లలకు ఉయిర్, ఉలగం అని పేర్లు కూడా పెట్టడం విశేషం.