2023 నెంబర్ 1 హీరో గా అల్లు అర్జున్..చరిత్ర సృష్టించిన తెలుగోడు!

0
291
Allu Arjun as the number 1 hero of 2023 Telugu made history

కసి,పట్టుదల మరియు టాలెంట్ ఉంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరు అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉదాహరణగా నిలిచాయి. అలాంటి ఉదాహారణలతో ఒకరిగా నిలిచాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

గంగోత్రి సినిమా సమయం లో అల్లు అర్జున్ ముఖాన్ని చూసిన ప్రతీ ఒక్కరు ఇతను హీరోనా అని వెక్కిరించారు. కానీ అలా వెక్కిరించినా వాళ్ళే నేడు అల్లు అర్జున్ విజయాల గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు అంటే, ఇంతకు మించిన సక్సెస్ ఇంకేమి కావలి చెప్పండి.

ఇకపోతే ‘పుష్ప : ది రైజ్’ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ బాక్స్ ఆఫీస్ ని ఒక్క ఊపు ఊపేసాడు. అతని మేనియా నుండి ఇంకా ఎవ్వరూ తేరుకోలేదు, ఈ స్థాయిలో సెన్సేషన్ సృష్టించాడు కాబట్టే అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కింది.

It is a pity that Mahesh has become like stop to his own son

ఇండస్ట్రీ పుట్టి ఇన్నేళ్లు అయినా ఎవరికీ దక్కని అద్భుతమైన అదృష్టం అల్లు అర్జున్ కి దక్కింది. అతను పడిన కష్టానికి ఆ మాత్రం రావాల్సిందే.

మరో పక్క రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ #RRR సినిమాలో అద్భుతంగా నటించినందుకు గాను, పాన్ వరల్డ్ స్టార్స్ గా అవతరించారు. అంతే కాకుండా #RRR చిత్రం కి ఆస్కార్ అవార్డు రావడం తో ఈ ఏడాది ఇండియా మొత్తం వీళ్లిద్దరి పేర్లు మారుమోగిపోయాయి.

కానీ అల్లు అర్జున్ ఫేమ్ వీళ్లిద్దరి మేనియా ని కూడా డామినేట్ చేసేసింది. 2023 వ సంవత్సరం సౌత్ లో అత్యంత ప్రభావితం చేసిన హీరోలలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లను అధిగమించి టాప్ 1 స్థానం లో నిలిచాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ ‘పుష్ప : ది రూల్’ లో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం సౌత్ తో పాటీలుగా ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది. ఈ సినిమా హిట్ అయితే అల్లు అర్జున్ టాలీవుడ్ నుండి రాజమౌళి కంటే బిగ్గెస్ట్ బ్రాండ్ ఇమేజి మరియు క్రేజ్ ని సంపాదించుకున్న వాడు అవుతాడు.

సౌత్ లో రజినీకాంత్ కంటే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యే అవకాశం అల్లు అర్జున్ కి ఈ చిత్రం ద్వారా దక్కింది. చూడాలి మరి ఆ స్థాయికి అతను చేరుకుంటాడా లేదా అనేది. ఒకవేళ చేరుకుంటే మాత్రం ఆయన ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా గర్వించాలి.