ఓ ఇంటివాడైన నాగశౌర్య

0
262
naga shourya wife anusha

మరో యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. అన్నడ అమ్మాయి అనూష శెట్టి మెడలో తాళి కట్టి, ఏడడుగులు నడిచి తన భాగస్వామిని చేసుకున్నాడు. ఈ తంతుకు బెంగళూరు వేదిక అయ్యింది. ఆదివారం (నవంబర్ 20)న 11.25 గంటలకు వారి పెండ్లికి ముహూర్తం నిర్ణయించగా అనుష్కకు తాళి కట్టాడు నాగశౌర్య. రెండు రోజుల పాటు బెంగళూరు వివాహ వేడుకలు నిర్వహించారు. శనివారం మెహిందీ వైభవంగా కొనసాగగా ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఆమె కన్నడియన్

ఈ వివాహానికి కొద్ది మందికే ఆహ్వానం ఉన్నట్లు సమాచారం. సమీప బంధువులు, సన్నిహితుల సమక్షంలో వేడుకలు నిర్వహించారు. సినీ ప్రముఖులు కూడా అంతగా కనిపించలేదు. ఇక అనూష విషయానికి వస్తే ఆమె కన్నడియన్. ప్రస్తుతం ఆమె ఎంట్రప్రెన్యూర్, ఇంటీరియర్ డిజైనర్ కంపెనీ నడుపుతుంది. ఈ విభాగంలో ఆమె పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

చేతిలో మూడు ప్రాజెక్టులు

వీరిది ప్రేమ వివాహమా, లేక పెద్దలు కుదిర్చారా అనే సందేహాలు ఉన్నాయి. అనూషను నాగశౌర్య ఎప్పుడు, ఎక్కడ కలిశాడు అనే సందేహాలు చిత్ర పరిశ్రమాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. షూటింగ్ లో ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. చిత్ర యూనిట్ హాస్పిటల్ కు తీసుకెళ్లింది. రెండు రోజుల పాటు చికిత్స పొందాడు. అక్కడ కూడా అనూష కనిపించలేదు. దీంతో ఆమె ఎవరూ.. వీరికి పరిచయం ఎక్కడ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతే కాక ఇతను 50 కోట్ల దాకా కట్నం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.