‘రాజయాలు చాలా కష్టం..’ మోగాస్టార్ నోటివెంట ఆసక్తిక వ్యాఖ్యలు

0
355

రాజకీయాలు చాలా కష్టమని మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు అందులో బాగా రాణిస్తున్నాడని ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ను ఉన్నత స్థానంలో చూస్తానని చెప్పాడు. 2008లో చిరంజీవి ‘ప్రజారాజ్యం’ స్థాపించాడు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. కొన్ని స్థానాలలో గెలిచిన ఆయన ఆశించిన ఫలితం రాలేదు. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో విలీనం చేసి సెంట్రల్ లో మంత్రి పదవిలో కొనసాగాడు.

అందుకే వీటికి ఫుల్ స్టాప్ పెట్టా

తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకు సైతం దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో చిరు శనివారం (నవంబర్ 20)న హైదరాబాద్ లోన వైఎన్ఎం కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు. ‘పాలిటిక్స్ అత్యంత క్లిష్టంగా ఉంటాయి.. మాటలు అనరావాలి.. పడేంత ఓపిక కూడా ఉండాలి. తనకు ఇవి అవసరమా..? అని ఒక దశలో అనిపించింది. అందుకే వీటికి ఫుల్ స్టాప్ పెట్టా’ అన్నాడు.

మంచి పట్టున్న నేత

పవన్ కళ్యాన్ నాలా కాదు. మంచి పట్టున్న నేతగా కొనసాగుతున్నాడు. వీటికి అతను సరిపోతాడు. ఇప్పటి వరకూ పవన్ అన్ని రంగాల్లో మంచి ముద్ర వేసుకున్నాడు. ఇందులో కూడా రాణిస్తాడని అనిపిస్తుంది. మంచి విజన్ ఉన్న నేతగా ఆయనకు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ ఇస్తానని చిరంజీవి గతంలోనే ప్రకటించి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించాడు. ఓ కాలేజ్ లో జరిగిన ఈవెంట్ లో చిరు నోటి నుంచి ఈ మాటలు రావడంతో ఏపీ రాజకీయాలలో మారో దుమారం చెలరేగేలా ఉంది.