ఎమ్మెల్యేలను తీసుకెళ్లి తేల్చడానికి అదేమైన టూరిస్ట్‌ స్పాటా

0
299
kavitha revanth reddy

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాల వివరాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. గత పాలనపై ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షం ఒకరిపై ఒకరు వాగ్బాణాలు విసురుకుంటున్నారు.

ఇందులో భాగంగా శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాగునీటి అంశాలపై ప్రసంగిస్తుండగా కల్వకుంట్ల కవిత కలుగజేసుకోవటం. దానికి సీఎం రేవంత్‌రెడ్డి బదులివ్వడం ఆసక్తికరంగా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగా కల్వకుంట్ల కవిత కలుగజేసుకుంటూ కావాలంటే ప్రాజెక్ట్‌లపై విచారణ చేసుకోవచ్చని, ఇందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు.

kavitha revanth reddy

ఇంట్రెస్టింగ్ గా రేవంత్ రెడ్డి బయోపిక్

దీనికి స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి ‘‘కవితగారు విచారణ చేసుకోవచ్చని అంటున్నారు. సంతోషం ఇలా ప్రతిపక్షం సహకరిస్తే మాకూ సంతోషమే. కవితగారి సూచన తప్పకుండా తీసుకుంటాం. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపి కాంట్రాక్ట్‌ తీసుకున్నోళ్లను, అవి ఇచ్చినోళ్లను, ఇందుకు కారకులైన మంత్రులను అందిరినీ ఏరకంగా చట్ట పరిధిలో శిక్షించాలో తప్పకుండా శిక్షిస్తాం.

ఈ రకంగా ప్రతిపక్షాలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే మేడిగడ్డ, అన్నారం విషయంలో సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేస్తాం. ఇదే విషయం మా జీవన్‌రెడ్డి గారు కూడా చెప్పారు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో గానీ.. అన్నారంలో గానీ చాలా ఘోరాలు జరిగిపోయాయి అని చెపుతున్నారు.

టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ తేల్చాల్సిన విషయాలను ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను తీసుకెళ్లి తేల్చడానికి అదేమైన టూరిస్ట్‌ స్పాటా అధ్యక్షా.. తప్పు జరిగితే తేల్చాల్సింది నిపుణులు. కాబట్టి నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి. పరీక్షలు చేయించండి. ఆ తర్వాత దేనికైనా సిద్ధంగా ఉంటాం. అందులో ఎటువంటి అనుమానం లేదు అన్నారు.