ఏపీ కాంగ్రెస్‌కు ఒక రేవంత్‌రెడ్డి కావాలి

0
231
ap congress

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్‌ది ఓ ప్రత్యేకమైన స్థానం. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన కాంగ్రెస్‌ 2009లో రాజశేఖరరెడ్డి మరణంతో తన పట్టును కోల్పోతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకోలేక చతికిల పడిరది నాటి నుండి నేటి వరకూ పరిస్థితి దిగజారుతోందే తప్ప పుంజుకుంటున్నట్లు ఎక్కడా కనపడటం లేదు.

అయితే ఇటీవల సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోను, మరో సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణలోనూ. కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టడంతో ఏపీ కాంగ్రెస్‌లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ తాజా పరిస్థితులతో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం సైతం ఏపీ కాంగ్రెస్‌పై ప్రత్యేక దృష్టిని సారించాలనే ఆలోచనలో ఉంది. రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌ క్యాడర్‌ మొత్తం గంపగుత్తగా జగన్‌మోహన్‌రెడ్డి వైపుకు మళ్లిపోయింది.

ap congress

జగన్‌కు బర్రెలక్క స్వీట్‌ వార్నింగ్‌

ఒక్క విషయం ఏమిటంటే దశాబ్దాల నుంచి ఉన్న పార్టీ కావడంతో దానికి పునాదులు చాలా పటిష్టం. పైగా బూత్‌ లెవల్‌ నుంచి నాయకత్వం ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. కానీ జగన్‌ వైపుకు మళ్లిన కేడర్‌ ఇప్పటికిప్పుడు తిరిగి కాంగ్రెస్‌ గూటికి రారనే విషయం కాంగ్రెస్‌ పెద్దలకు కూడా తెలుసు.

అయితే తమవంతు ప్రయత్నం ఇప్పటి నుంచే మొదలు పెడితే.. 2024లో కాకపోతే 2029లో నైనా అధికారంలోకి రావచ్చు అనేది వారి ఆలోచన. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్‌ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే.

ఈ వ్యతిరేకతను ఈసారికి టీడీపీGజనసేన కలిసి తమవైపు మళ్లించుకుంటాయి. కాబట్టి ఈ ఎన్నికలపై కాకుండా 2029ని టార్గెట్‌ చేయాలని. ఈలోపు గతంలో విభజనకు కాంగ్రెస్‌ పార్టీకి దిక్సూచిలా మారిన వై.యస్‌. రాజశేఖరరెడ్డిలా ప్రజలకు నమ్మకం కలిగించే నాయకుడు కావాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

తెలంగాణ విషయంలో ఇప్పటికే రేవంత్‌రెడ్డి వైయస్సార్‌ తరహాలో పార్టీలోను, ప్రజలల్లోనూ నాయకుడిగా మంచి ముద్ర వేయగలిగాడు. ఈ కారణంగానే అధికారంలోకి రాగానే ఇతర నాయకులు కూడా ఇదివరకు చేసినంత హంగామా. చేయకుండా సీనియర్లు మంత్రిపదవులతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డిలాంటి తెగువైన నాయకుడు ఏపీ కాంగ్రెస్‌కు కావాలన్నమాట.