అన్నకు షర్మిల క్రిస్మస్‌ షాక్‌.

0
389
Sharmilas Christmas shock for Anna

ఎవరికైనా పండుగ నాడు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి గిఫ్ట్‌లు అందుకుంటారు. కానీ పాపం జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా తయారైంది. నితిన్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అ…ఆ’ సినిమాలో రావు రమేష్‌ ‘‘శత్రువులు ఎక్కడో ఉండరు..

మన కూతుర్లు, పెళ్లాల రూపంలో మన కళ్లముందే తిరుగుతుంటా’’ అంటాడు. ఇప్పుడు ఈ డైలాగ్‌ సరిగ్గా వై.యస్‌. జగన్‌మోహన్‌రెడ్డికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే క్రిస్మస్‌ పండుగ రోజున ఆయనకు గిఫ్ట్‌ ఇవ్వాల్సిన చెల్లెలు షాక్‌ ఇచ్చింది. ఈయనకు ఇవ్వాల్సిన గిఫ్ట్‌ను ఈయన బద్ధ శత్రువు నారా చంద్రబాబు నాయుడికి పంపింది. ఇది అసలైన ట్విస్ట్‌.

Sharmilas Christmas shock for Anna

పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నాడు అంటూ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్!

రెండు రోజుల క్రింత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఊహించని విధంగా ప్రశాంత్‌ కిషోర్‌ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి దాదాపు 3 గంటలు చర్చలు జరపడం తీవ్ర సంచలనం రేపింది.

తాజాగా క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని వై.యస్‌. జగన్‌ స్వంత సోదరి షర్మిళ క్రిస్టియన్‌ అయిన అన్నకు బదులుగా హిందువు అయిన చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ గిఫ్ట్‌ను కూడా పంపింది.

ఇదే పెద్ద సంచలనం అయితే ఆ గిఫ్ట్‌ మీద ‘‘2024లో మీరు దేవుడి ఆశీస్సులు పొందాలి’’ అంటూ క్యాప్షన్‌ కూడా రాసిపంపడం తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ విషయం ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనకు శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్వాలేదు కానీ.. తన బద్ధ శత్రువుకు క్రిస్మస్‌ గిఫ్ట్‌ పంపడం తన పరువు తీస్తే…

దాని మీద ‘‘2024లో మీరు దేవుడి ఆశీస్సులు పొందాలి’’ అంటూ క్యాప్షన్‌ కూడా రాయడం పుండుమీద కారం జల్లినట్లు అయింది జగన్‌కు. అంటే తన ఓటమిని ఆమె తీవ్రంగా కాంక్షిస్తున్నట్లుగా చెప్పకనే చెప్పినట్లు అయింది. ఈ విషయం మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తే..

దీన్ని లోకేష్‌ తన ట్విట్టర్‌ అకౌండ్‌లో షర్మిళకు కృతజ్ఞతలు చెపుతూ పోస్ట్‌ చేయడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. జగన్‌ ఓటమిని బలంగా కోరుకుంటున్న షర్మిళ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలకు తెర తీస్తారో చూడాలి.