ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం

0
299
lokesh prasanth kishore

ఏ ముహూర్తాన రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం, శాశ్వత శత్రుత్వం ఉండదని అన్నారో గానీ.. అది నిత్య సూత్రమూ విలసిల్లుతోంది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ అవసరం పడుతుందో ఎప్పుడూ చెప్పలేం. అందుకే రాజకీయంగా అవతల పార్టీతో వైరం నటిస్తూనే లోపాయికారిగా స్నేహ హస్తం అందిస్తుంటారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సూత్రం రాజకీయ పార్టీల స్ట్రాటజిస్ట్‌లకు కూడా పనికొస్తోంది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే… ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ… బిహారీ స్ట్రేటజిస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ ప్లేటు పిరాయించాడు.

2014లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి ప్రశాంత్‌ కిషోర్‌ Ê టీం రకరకాల పన్నాగాలు పన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం లక్ష్యంగా కూడా ఆ పార్టీకి స్ట్రాటజిస్ట్‌గా పనిచేసిన ప్రశాంత్‌ కిషోర్‌ టీం రకరకాల ఎత్తులు వేసింది.

ఇందులో భాగంగానే కోడికత్తి డ్రామా అడిరచారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. అలాగే నవరత్నాలు అని.. ఒక్క ఛాన్స్‌ అని అనేక మాయలు చేసి మొత్తానికి జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు.

lokesh prasanth kishore

చంద్రబాబు, జగన్‌లు సాధించలేనిది జేడీ సాధిస్తారా

తాజాగా ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతూ ఈరోజు మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలిసి ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి ఒకే విమానంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్నారు. గన్నవరం నుంచి కూడా ఇద్దరూ ఒకే కారులో తాడేపల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు.

జగన్‌మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పీకే ఇలా ప్లేటు ఫిరాయించి చంద్రబాబు శిబిరంలో కనిపించడం రాజకీయ వర్గాల్లో విపరీతమైన చర్చకు దారితీసింది.

అయితే చంద్రబాబు ఇంట్లో యజ్ఞం జరుగుతున్నందున దానికి హాజరయ్యారని పైకి చెపుతున్నా.. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేసేందుకు పీకేను నియమించే ఉద్దేశంతోనే ఆయన్ని ఉండవల్లి నివాసానికి లోకేష్‌ దగ్గరుండి మరీ హైదరాబాద్‌ నుంచి వెంటబెట్టుకొచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌లో అసలు విషయం తెలియాలంటే రెండు రోజులు ఆగక తప్పదేమో.