జగన్‌కు ముగ్గురు ఎమ్మెల్యేల షాక్‌

0
220
Three MLAs shocked Jagan

రాజకీయాల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఎవరికీ అంతుబట్టని విషయంగా భావిస్తుంటారు. దీని కోసం జ్యోతిష్కులను, పేరున్న రాజకీయ విశ్లేషకులను, సర్వే సంస్థలను కూడా సంప్రదిస్తూ ఉంటారు. అయితే సునామీ వచ్చే ముందు మూగ జీవాలకు తెలిసిపోతుందట.

అలాగే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ముందుగా జంపింగ్‌ జపాంగ్‌లకు పూర్తి క్లారిటీ ఉంటుందనేది ఎన్నోసార్లు నిరూపితం అయింది. భవిష్యత్తులో నిరూపణ అవుతుంది కూడా. అలా రాబోయే ఎన్నికల గాలిని పసిగట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు జగన్‌కు షాక్‌ ఇచ్చారు.

Three MLAs shocked Jagan

పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నాడు అంటూ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్

రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికలో భాగంగా కొందరికి జగన్‌ టిక్కెట్లు నిరాకరిస్తున్నట్లు చెప్పడం సంచలనంగా మారింది. దీంతో ఆయా నియోజకవర్గాల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు జగన్‌తో పనికాదని గ్రహించి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీల వైపు చూస్తున్నారు. చూడటమే కాదు..

ఇప్పటికే ఆయా పార్టీల అధినాయకత్వంతో టచ్‌లోకి కూడా వెళ్లారు. వీరిలో కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పిఠాపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌లు ఉన్నారు.
జ్యోతుల చంటిబాబు తెలుగుదేశం పార్టీ నుంచి 2014లో వైసీపీలోకి వచ్చి ఆ ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019లో గెలిచారు.

ప్రస్తుతం టికెట్‌ దక్కదని తెలియడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నారు. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు టిక్కెట్‌ నిరాకరించారు జగన్‌. ఆయనకు కాకినాడ ఎంపీగా అవకాశం ఇస్తామని చెప్పారట.

2024లో పిఠాపురం నుంచి ఎంపీ వంగా గీతను బరిలోకి దింపుతున్నారు. దీన్ని అవమానంగా ఫీలయిన దొరబాబు జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారు. ఇందుకోసం ప్రస్తుతం హైదరాబాద్‌లోనే మకాం వేశారు.

ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌కు కూడా టిక్కెట్‌ నిరాకరించడంతో ఆయన టీడీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఈయన ప్లేస్‌లో వైసీపీ నుంచి వరుపుల సుబ్బారావు, లేదా ముద్రగడ పద్మనాభంలు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొసమెరుపేమిటంటే… టీడీపీ, జనసేనల్లో చేరేందుకు వీరు టెక్కెట్‌ హామీ ఇవ్వకపోయినా తమను గౌరవంగా చూసుకుంటే చాలని కోరడం. తెలుగుదేశం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండడంతో, పవన్‌ కూడా అదే దారిలో ఉన్నారట.