చంద్రబాబు సహకారం తోనే షర్మిల కి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు?

0
288
With Chandrababus cooperation Sharmila got the reins of Andhra Pradesh Congress

వై ఎస్ షర్మిల ఇటీవల తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంఘటన ఎంత పెద్ద సంచలనం గా మారిందో మన అందరికీ తెలిసిందే.

పెద్ద ఆర్భాటం తో రాజకీయ పార్టీ ని స్థాపించిన ఆమె, కనీసం పోటీ కూడా చెయ్యకుండా విలీనం చెయ్యడం అనేది వై ఎస్ ఆర్ అభిమానులను తల దించుకునేలా చేసింది.

మాట తప్పదు మడమ తిప్పడు అనే గొప్ప పేరున్న రాజన్న కూతురుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ఆయన పేరుకి మచ్చ తీసుకొచ్చేలా షర్మిల ప్రవర్తించింది అని వైసీపీ పార్టీ నాయకులూ మరియు అభిమానులు ఆమె పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

అయితే షర్మిల ఇలా మారిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు ప్రభావమే అని కొంతమంది వాదన. షర్మిల పార్టీ పెట్టిన దగ్గర నుండి చంద్రబాబు తో టచ్ లో ఉందని, ఆయన ఇచ్చిన ఆలోచనల వల్లే ఇలా జరిగిందని అంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ వంటి వారే ఈ మాట చెప్పారంటే అందులో ఎంత నిజం ఉందో అర్థం చేసుకోవచ్చు.

is-sharmila-more-dangerous-to-jagan-than-tdp-jana-sena

జగన్ ని ఓడించడానికి అందరూ ఏకం అవుతున్నారని, కానీ ఎంత మంది వచ్చినా జగన్ సంపూర్ణమైన మెజారిటీ తో ఈసారి కూడా ప్రభుత్వాన్ని స్థాపిస్తాడని సజ్జల బలమైన నమ్మకం తో చెప్పాడు.

కాంగ్రెస్ పార్టీ తో చంద్రబాబు నాయుడు కి గత కొద్ది సంవత్సరాల నుండి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరుపున తెలంగాణ సీఎం గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి,

చంద్రబాబు నాయుడు కి భక్తుడు లాంటి వాడు. అతన్ని అడ్డం పెట్టుకొనే, షర్మిల కి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందడం లో చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డి పాత్రలు చాలా పెద్దది అని అంటున్నారు.

షర్మిల ఆంధ్ర రాజకీయాల్లోకి అడుగుపెడితే కచ్చితంగా వైసీపీ పార్టీ కి నష్టం కలుగుతుంది. ఎంత కాదు అనుకున్నా ఒక గణనీయమైన ఓటు బ్యాంక్ చీలిపోతుంది.

దీని వల్ల వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. అసలే టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తుంది,

ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ ద్వారా రాబోతుంది,మరోపక్క పార్టీ లో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ పార్టీ ని వీడి వెళ్లిపోతున్నారు , పాపం వైసీపీ కి ఇది మామూలు గడ్డు కాలం కాదు, ఎలా అధిగమిస్తారో చూడాలి.