టీడీపీ – జనసేన కంటే జగన్ కి షర్మిల వల్లనే ఎక్కువ డేంజర్ ఉందా..?

0
191
is-sharmila-more-dangerous-to-jagan-than-tdp-jana-sena

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా నాల్గవ పార్టీ ఊపిరి పోసుకోబోతుంది. ఇది వరకు టీడీపీ , జనసేన మరియు వైసీపీ పార్టీల మధ్య పోరు ఉండేది.

ఇప్పుడు కొత్తగా షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరడం, త్వరలోనే ఆమె ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిధ్యం వహించబోతుండడం తో నాల్గవ పార్టీ గా కాంగ్రెస్ కూడా తన ఉనికిని చాటుకునే అవకాశం ఉందని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర లో పుంకుకుంటే టీడీపీ కి నష్టమా?, జనసేన కి నష్టమా?, లేకపోతే వైసీపీ పార్టీ కి నష్టమా అనే చర్చలు గత కొంతకాలం గా సోషల్ మీడియా లో జరుగుతున్నాయి.

Why is Sharmila so determined to get a position for money

ఇందులో సందేహాలు, తర్జన భర్జన పడాల్సిన అవసరాలు లేవు, కచ్చితంగా వైసీపీ పార్టీ కి తీవ్రమైన నష్టం అనే చెప్పాలి. ఇప్పటికే వైసీపీ నుండి 40 మంది సిట్టింగ్ ఎమ్యెల్యేలు షర్మిల తో టచ్ లో ఉన్నారు.

ఆమె ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిధ్యం చేపట్టే రోజునే పది మంది వైసీపీ ఎమ్యెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే వైసీపీ నుండి ముగ్గురు ఎమ్యెల్యేలు అదృశ్యం అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

దానికి తోడు షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడితే జగన్ కుప్పకూలిపోవడం ఖాయం. ఎందుకంటే సొంత సామజిక వర్గం లో ఊహించిన దానికంటే ఎక్కువ చీలికలు వస్తాయి.

పైగా ఆంధ్ర ప్రదేశ్ కి మొట్టమొదటి మహిళా సీఎం అయ్యే అవకాశం ఉంటే, జనాలు కచ్చితంగా షర్మిల కి ఓట్లు వేసి గెలిపిస్తారు, ఆమెని సీఎం చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు.

అదే కనుక జరిగితే ఇక ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ శకం ముగిసినట్టే. ఇప్పుడు జగన్ కి అతి పెద్ద శత్రువు టీడీపీ, లేకపోతే జనసేన కాదు. తన సొంత చెల్లెలు షర్మిలనే అతి పెద్ద శత్రువు అనే చెప్పాలి.

మరి చెల్లెలు తో అన్నయ్య సంధి చేసుకుంటాడా?, లేకపోతే పోరాడుతాడా అనేది రాబొయ్యే రోజుల్లో తెలుస్తాది.