విశాఖ ఎంపీకి బొత్స జాన్సీతో చెక్‌ పెట్టడమా?

0
323

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు ఏదో అనుకుంటే మరేదో అవుతోంది.

ఇటీవల ప్రకటించిన రెండు విడతల అభ్యర్ధులు, కొత్త ఇన్‌చార్జ్‌లతో తలబొప్పికట్టినా వైసీపీ అధిష్ఠానం తీరు మాత్రం మారటం లేదు. ఎక్కడ ఎవరిని అకామిడేట్‌ చెయ్యాలో…

ఎక్కడ ఎవరిని తప్పించాలో అనే విషయాల్లో ఒక స్ట్రాటజీ అంటూ లేకుండా పోయింది. ఒక నియోజకవర్గంలో బలమైన కేడర్‌ను ఏర్పాటు చేసుకున్న వారిని, వారికి అస్సలు పరిచయం లేని చోటుకు మార్చడం.

పైగా ఎన్నికలు పట్టుమని 3 నెలలు కూడా లేని సమయంలో ఇలా చేయడం అసలుకే మోసం వస్తుందని జగన్‌ తెలుసుకోలేక పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

తాజాగా విశాఖపట్నం ఎంపీగా ఉన్న బిల్డర్‌, ప్రముఖ నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణను తప్పించి ఆ స్థానంలో బొత్స సత్యన్నారాయణ సతీమణి, మాజీ ఎంపీ బొత్స జాన్సీని నిలబెట్టాలని జగన్‌ నిర్ణయించుకున్నారట.

ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఎంవీవీని విశాఖ నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతున్నట్లు తెలిసింది. ఉత్తరాంధ్రలో బొత్స కుటుంబానికి పేరున్న మాట వాస్తవమే అయినప్పటికీ, బొత్స రaాన్సీ గత రెండు టర్మ్‌లు ఎంపీగా విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు.

Chandrababus situation is like a pit in the front and a pit in the back

ఆమెకు విశాఖపట్నం కేటాయించడం కరెక్ట్‌కాదనే వాదన ఉంది. అలాగే 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సునామీ స్థాయి గాలిలోనూ విశాఖపట్నంలోని ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌, సౌత్‌ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేసింది.

అలాగే 2014 ఎన్నికల్లో కూడా విశాఖ ఈస్ట్‌, వెస్ట్‌, సౌత్‌లు తెలుగుదేశం పార్టీ గెలుచుకోగా, నార్త్‌ మాత్రం తెలుగుదేశం పార్టీతో పొత్తులు భాగంగా బీజేపీ (విష్ణుకుమార్‌ రాజా) గెలుచుకుంది.

ఈ ప్రకారం చూసినా విశాఖనగర ప్రజలు వైసీపీని 2014, 2019 ఎన్నికల్లో తిరస్కరించారు. పైగా ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం, ఉత్తరాంధ్ర అభివృద్ధిని గాలికొదిలేయడం,

విశాఖపట్నంలో భూములను విజయసాయిరెడ్ది ఆధ్వర్యంలో 22`ఎ చట్టాన్ని అడ్డుపెట్టుకుని కబ్జాలు చేయడం, ఓ భూ వివాదంలో ఏకంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు,

సన్నిహితుడైన ఆడిటర్‌ను కిడ్నాప్‌ చేయడంలాంటి అనేక ఘటనలు విశాఖ ప్రజల్లో భయాందోళనలు కలిగించిన తరుణంలో విశాఖ ఎంపీగా నాన్‌ లోకల్‌ అయిన బొత్స జాన్సీని నిలబెడితే విజయం వరిస్తుందని జగన్‌ ఎలా నమ్ముతున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు.