ఏపీ కాంగ్రెస్‌ కోసం తెర వెనుక లగడపాటి మంత్రాంగం…

0
263
Lagadapati Mantraanga behind the curtain for AP Congress

లగడపాటి రాజగోపాల్‌… రెండు పర్యాయాలు విజయవాడ ఎంపీగా గెలుపొందిన నేత. రాజశేఖరరెడ్డికి కరుడుగట్టిన అనుంగుడు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచటానికి శక్తికి మించి పోరాడిన వ్యక్తి.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవం చవి చూసిన తర్వాత రాజకీయాలకు తనంతట తానుగా దూరమయ్యారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని కూడా ఆయన ఆనాడు చెప్పటం జరిగింది.

అయితే అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. అనే పాటకు అనుగుణంగా ఆయనకు మళ్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించక తప్పడంలేదనే వార్తలు వస్తున్నాయి.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి పునర్‌వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా దివంగత వైయస్సార్‌ కుమార్తె షర్మిళకు ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించడం దాదాపు ఖరారు అయ్యింది.

ఆమె కూడా ఢల్లీి వెళ్లి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీల సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు మరెంతో సమయంలేని కారణంగా షర్మిళ ఇప్పటికిప్పుడు పార్టీ మీద పట్టు సాధించే అవకాశం కూడా చాల తక్కువగా ఉంది.

కాబట్టి ఆమెను స్టార్‌ క్యాంపెయినర్‌గా కూడా వాడుకుంటూ పార్టీ బలోపేతానికి ఓవైపు కృషి చేస్తూనే మరోవైపు తెరవెనుక మంత్రాంగం మొత్తం లగడపాటికి అప్పగించారని తెలుస్తోంది.

2004 ఎలక్షన్స్‌కు పూర్వం కూడా లగడపాటి వైయస్సార్‌ పాదయాత్రను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆ పాదయాత్ర మొత్తం ఖర్చు లగడపాటి పెట్టుకున్నారని చాలామంది కాంగ్రెస్‌ వాదులు చెపుతుంటారు.

Shinganamala Will that MLA also give jalak to Jagan

లగడపాటి ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ, ఢల్లీిలో ఉంటూ తన బిజినెస్‌లను చూసుకుంటున్నారు. ప్రస్తుతం షర్మిళకు తోడుగా తెర వెనుక వ్యవహారాలు చక్కబెట్టేందుకు లగడపాటిని సోనియా ప్రత్యేకంగా పిలిచి మాట్లాడినట్టు తెలుస్తోంది.

ఈ కారణంగానే లగడపాటి ఢల్లీి నుంచే ఏపీ కాంగ్రెస్‌ నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఈరోజు రాజమండ్రి వచ్చి ఉండవల్లి,

హర్షకుమార్‌లను కూడా కలవడం తన బాధ్యల్లో భాగమని తెలుస్తోంది. చూద్దాం ఆంధ్ర ఆక్టోపస్‌ కాంగ్రెస్‌ ముఖ చిత్రాన్ని ఏ విధంగా మార్చే ప్రయత్నం చేస్తారో.