టీడీపీ లోకి విలీనం దిశగా అడుగులు వేస్తున్న జనసేన పార్టీ?

0
302
Janasena party taking steps towards merging into TDP

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మంచి ఊపులో ఉన్న సమయం లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం ఆ జనసేన కి శాపం లాగ మారిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి కలిసి అక్కడికక్కడే పొత్తు ప్రకటించడం, ఆ తర్వాత వారాహి టూర్ ఆగిపోవడం, జనసేన శ్రేణులను తికమకకి గురి చేసింది.

Janasena party taking steps towards merging into TDP

జగన్‌ కోపానికి విజయసాయి, మిథున్‌రెడ్డి షాక్‌!

ఈ పొత్తు రాజకీయాల్లో పెను సంచలనం గా మారబోతుంది అని అనుకుంటే, నారా లోకేష్ ఇస్తున్న రీసెంట్ ఇంటర్వ్యూలు చూస్తుంటే ఆయన జగన్ ని మరోసారి ముఖ్యమంత్రి చేసే వరకు నిద్రపోయేలా లేడు అనిపిస్తుంది.

టీడీపీ – జనసేన అధికారం లోకి వస్తే ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడే ఉంటాడని లోకేష్ ప్రకటించిన రోజు నుండి ఈ పొత్తు పతనం ప్రారంభం అయ్యింది అనేది రాజకీయ విశ్లేషకుల వాదన.

పవన్ కళ్యాణ్ కనీసం రెండేళ్లు అయినా ముఖ్యమంత్రిగా పని చెయ్యకపోతే అసలు ఈ పొత్తు ఎందుకు?, మళ్ళీ జనసైనికులు టీడీపీ పల్లకి ని మోస్తూ బానిసలు లాగ బ్రతకాల్సిందేనా అని జనసేన కార్యకర్తలు వాపోతున్నారు.

ఇలా అయితే జనసేన నిల్చున్న స్థానాల్లో మినహాయించి, మిగిలిన అన్నీ చోట్ల వైసీపీ కి ఓటు వేస్తాము, లేదంటే బీజేపీ కి వేస్తాము అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో బహిరంగంగానే చెప్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కి సీఎం సీట్ షేర్ ఇవ్వకపోతే జరిగేది ఇదే.

చంద్రబాబు పాలనలో అవకతవకలు జరిగినప్పుడు కచ్చితంగా పవన్ కళ్యాణ్ గొంతెత్తి ప్రశ్నిస్తాడు. వీడు మనకి భవిష్యత్తులో ఏకులాగా మారబోతున్నాడు అని అర్థమైన వేంటనే పవన్ కళ్యాణ్ కి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం మొదలు పెడుతాడు చంద్రబాబు నాయుడు.

2014 ఎన్నికలలో వైసీపీ నుండి 23 ఎమ్యెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తనకి రివర్స్ అవుతున్నాడు అని తెలిస్తే అతని ఎమ్యెల్యే అభ్యర్థులను అలా ఏమార్చి కొనడు అని ఎవరు మాత్రం గ్యారంటీ ఇవ్వగలరు?

అదే కనుక జరిగితే ఇక పవన్ కళ్యాణ్ చేసేది ఏమి లేదు, తన అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో కలిపినట్టుగా, తన జనసేన పార్టీ ని కూడా టీడీపీ లో కలిపే స్థితికి వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్.