నేనైతే జానారెడ్డిని కాదు… కేసీఆర్‌కు రేవంత్‌ వార్నింగ్‌..

0
215
Revanth warns KCR that I am not Jana Reddy

విలువలు, విశ్వసనీయత, వంకాయ, బెండకాయ, తోటకూర ఇవన్నీ ఒకప్పుడు. పాతతరం రాజకీయాల్లో ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించేవారు. కానీ కాలం మారింది. అంతేనా..

రాజకీయాలు కూడా మారాయి. ఒక చెంప మీద కొట్టేలోపే రెండు చెంపలు ఛెళ్లుమనిపిస్తున్నారు. ఇదే ఈ తరం ట్రెండీ పాలిటిక్స్‌. ప్రత్యర్ధి ఏ స్టెప్‌ వేస్తే..

మనం ఏ వ్యూహం వాడాలి అనేది ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తనదైన వ్యూహాలు సిద్ధం చేసిపెట్టుకున్నట్టే ఉన్నారు.

వివరాల్లోకి వెళితే.. శనివారం నాడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకున్నారు ఏబీఎన్‌ ఎండీ రాధాకృష్ణ. ఎలక్షన్స్‌కు ముందు రేవంత్‌రెడ్డిని ఆర్కే పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇంటర్వ్యూ చేశారు.

అప్పుడే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, అనంతరం తప్పకుండా మీకే నేను ముందు ఇంటర్వ్యూ ఇస్తాను అన్నారు.

Telangana is the center of national politics

ఆ మాటను నిలబెట్టుకుంటూ 30 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏబీఎన్‌కు స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. సహజంగా రాధాకృష్ణ నిర్వహించే ఇంటర్వ్యూలు అన్నీ ఏబీఎన్‌ స్టూడియోలోనే జరుగుతుంటాయి..

కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటర్వ్యూ మాత్రం రాధాకృష్ణ ఇంట్లో జరగడం విశేషం. ఈ సందర్భంగా రాధాకృష్ణ మీకు ఉన్న సంఖ్యాబలం మ్యాజిక్‌ ఫిగర్‌కన్నా 4 మాత్రమే, సీపీఐని కలుపుకుంటే 5.

ఈ సంఖ్యాబలం చాలా బలహీనమైనది. కేసీఆర్‌ ఏదైనా వ్యూహం (ఎమ్మెల్యేలను లాక్కోవడం) పన్నితే చాలా ఇబ్బందే కదా? ఎలా? అన్నారు. దానికి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ అలాంటి రాజకీయాలకు పాల్పడతాడని నేను అనుకోను.

ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ మాకు కొండంత అండ. నేనైతే అలాంటి నీచ రాజకీయాలకు పాల్పడదల్చుకోలేదు. అందుకే ఇప్పకే బీఆర్‌ఎస్‌ నుంచి కొందరు వస్తామని అన్నా..

మేం తీసుకోలేదు. ఒకవేళ మీరన్నట్టు కేసీఆర్‌ మళ్లీ పాత పోకడలకు పోవాలిన చూస్తే ఫలితం ఆయన ఊహించనంతగా ఉంటుంది. నేనేమీ జానారెడ్డిని కాదు అన్నారు.

అంటే ఒకవేళ కేసీఆర్‌ తమ నుంచి 1 ఎమ్మెల్యేను లాక్కోవాలి అని చూస్తే మేము 5 మందిని ఆ పార్టీ నుంచి లాక్కుంటాము అన్నరీతిలో సమాధానం చెప్పారు. నేను జానారెడ్డిని కాను అంటే…

కేసీఆర్‌ తొలిసారి సీఎం అయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను జంప్‌ చేయిస్తుంటే.. పార్టీకి నాయకత్వం వహిస్తున్న జానారెడ్డి ఆశించిన రీతిలో ప్రతిఘటించక పోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

ఇప్పుడు అలాంటిది జరిగితే రేవంత్‌రెడ్డి దూకుడు ఏ రేంజ్‌లో ఉంటుందో అటు బీఆర్‌ఎస్‌ నాయకత్వానికి, ఇటు కాంగ్రెస్‌ జంపింగ్‌ జపాంగ్‌లకు కూడా బాగా తెలుసు.