జగన్‌కు బర్రెలక్క స్వీట్‌ వార్నింగ్‌

0
437
jagan barrelakka

తన స్థాయికి తగ్గట్టు మాట్లాడటం పాలిటిక్స్‌లు ఉండాల్సిన ప్రథమ లక్షణం. ముఖ్యంగా ఎవడో రాసిన స్క్రిప్ట్‌లను యధాలాపంగా చదువుకుంటూ పోతే.. ప్రజలు ఆ స్క్రిప్ట్‌ రాసిన వాడిని ఛీదరించుకోరు.. చదివిన వాడిని హేళన చేస్తారు. ఏదో ఒకసారో.. రెండు సార్లో అయితే పర్వాలేదు.. కానీ పదే పదే అలా తన పరువు తానే తీసుకుంటే ఇక ఆ నాయకుడి ఇమేజ్‌ను కాపాడటం ఎవరివల్లా కాదు.

విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా ఓ సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా యధావిధిగా తెలుగుదేశం పార్టీని, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 లతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను తిట్టిపోశారు.

jagan barrelakka

బాబు పవన్‌ను కలవడంలో దాగున్న విషయాలు

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన్ను తక్కువ చేసేలా తనకు కోట్లాది మంది ప్రజల బలం ఉందని చెపుతుంటారని, కానీ మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో పోటీచేసి, ఒక్క స్థానంలో కూడా నెగ్గలేదని, ఆఖరికి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బర్రెలక్క (శిరీష)కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు.

ఈ విషయమై బర్రెలక్క స్పందించింది. పవన్‌ కల్యాణ్‌గారు ప్రజల కోసం నిలబడిన నాయకుడని, ఆయన ప్రజలకు మంచి చేయాలనే మంచి ఉద్దేశంతో రాజకీయాల్లో కొనసాగుతున్నారని, ఆయన్ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని, అందులోనూ తనను అడ్డుపెట్టుకుని పవన్‌ను తక్కుచేయడం తగదని జగన్‌కు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

ఇప్పుడు ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలా చిల్లర స్క్రిప్ట్‌లు చదివి ఆ పదవికి ఉన్న గౌరవం తీయొద్దని, 2019 ఎన్నికల్లో జనసేన సత్తా ఏమిటో నీకు తెలుసని, అయినా ప్రజలకు చేసిన మంచిని చెప్పుకోవాల్సిన స్టేజిమీద పవన్‌పై పడి ఏడవడం తగదని, పవన్‌ కనీసం ధైర్యంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశాడు.

నువ్వు ఏకంగా తోకముడిచి పారిపోయావు. 2018 ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్‌లు కూడా దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని పవన్‌ అభిమానులు కూడా జగన్‌కు హితబోధ చేస్తున్నారు.