టీడీపీ అనర్హత గేమ్‌ అదిరిపోయిందిగా…

0
156
TDPs disqualification game is over

పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదని సంబరపడిరదనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే గురివింద గింజ తన కింద నలుపెరుగదనే సామెత కూడా అందరికీ తెలిసిందే..

కానీ ప్రపంచం మొత్తానికి తెలిసిన ఈ సామెత పాపం జగన్‌మోహన్‌రెడ్డి అండ్‌ కోకు మాత్రం తెలిసినట్లు లేదు. అందుకే తమ పార్టీని కాదని తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్న ఎమ్మెల్యేలు,

ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ, మండలి స్పీకర్లకు ఫిర్యాదు చేసింది వైసీపీ నాయకత్వం. ఇప్పుడు ఇది ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌ కాదు..

హాస్యాస్పదంగా మారింది. ఎలాగూ ఇరు సభల స్పీకర్లు తమవారే కావడం, రెండు సభల్లోనూ తమకు మెజార్టీ బలం ఉండడంతో వైసీపీ ఈ అడుగు వేసింది.

అయితే వైసీపీ చర్యకు ప్రతి చర్యగా తెలుగుదేశం పార్టీ కూడా తమ పార్టీ నుంచి గెలిచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో అంటకాగుతున్న ఎమ్మెల్యేలు మద్దాల గిరి,

Pawan Kalyan will contest from there

కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌లపై తక్షణం చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వైసీపీ మొదలు పెట్టిన అనర్హత గేమ్‌ ఆసక్తికరంగా మారింది.

వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా

జగన్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా ఆ పార్టీకి దూరమై తెలుగుదేశం పార్టీలో పంచన చేరారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్‌,

సి. రామచంద్రయ్యలు కూడా వైసీపీని వీడి ఒకరు జనసేనలోను, మరొకరు తెలుగుదేశం పార్టీలోనూ చేరారు. తమ పార్టీ నుంచి గెలిచి ప్రతిపక్ష పార్టీకి మద్దతు తెలుపుతున్నారనే కారణంగా తమ బహిష్క్రత ఎమ్మెల్యేలను ఇరకాటంలో

పెట్టడం ద్వారా టీడీపీకి చుక్కలు చూపించాలని వైసీపీ భావించగా, టీడీపీ సైతం ఈ గేమ్‌కు రివర్స్‌గేమ్‌ ఆడి, తమ పార్టీలో గెలిచి వైపీసీకి మద్దతు తెలిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గతంలోనే ఫిర్యాదు చేశామని,

అయితే ఇప్పటికీ దానిపై చర్యలు తీసుకోలేదని, ముందు దానిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు లేఖ రాసింది. అంతేకాక ఎందుకయినా మంచిది అని ఫ్రెష్‌గా రెడీ చేసిన మరో ఫిర్యాదును కూడా స్పీకర్‌కు పంపింది.

దీంతో ముఖ్యంగా అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. చూద్దాం పెద్ద స్థానంలో కూర్చున్న ఆయన ఎంత పెద్ద విలువలతో కూడిన తీర్పు ఇస్తారో.