గుటుక్కుమన్న గుడ్డుమంత్రి టిక్కెట్టు…

0
293
Gutukkumanna Guddumantri ticket

అంతన్నాడిరతన్నాడే.. లింగరాజు నన్నొగ్గేసెల్పోనాడే లింగరాజు.. అస్కన్నడు.. బుస్కన్నడే లింగరాజు… అన్నట్టుగా తయారైంది పాపం గుడ్డు మంత్రి అమర్నాథ్‌ పరిస్థితి.

కొడాలి నానీ, పేర్ని నాని, రోజా, జోగి రమేష్‌ వంటి వారు ప్రతిపక్షాలను తెగతిట్టిపోసి జగన్‌ మనసులో స్థానం సంపాదించుకుంటుంటే తాను మాత్రం ఏం తక్కువ తిన్నాను అనుకుంటూ పవన్‌ కల్యాణ్‌తో ఈయన దిగిన ఓ ఫొటోను వెటకారంగా మాట్లాడుతూ..

ఈ ఫొటోను గమనించండి నేను పవన్‌తో ఫొటో దిగినట్లు ఉందా.. పవన్‌ నాతో దిగినట్లు ఉందా? అని కుళ్లు కామెడీ సృష్టించబోయి నవ్వుల పాలయ్యాడు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. ఆ తర్వాత జనసైనికులు ఆయన్ను సోషల్‌ మీడియాలో ఫుట్‌బాల్‌ అడుకున్నారనుకోండి.

ఆమధ్య విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు అంటూ హంగామా చేసి, 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటూ హడావుడి చేసి, ఆఖరికి 13 వందల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా చూపించలేక మొహం చాటేసుకున్నాడు అమర్నాథ్‌.

జగన్‌ వీర వీధేయుల్లో ఒకడిగా తనకు స్థానం దక్కిందని సంబరపడిపోతున్న ఆయనకు జగన్‌ మోహన్‌రెడ్డి జలక్‌ ఇచ్చాడు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా అనూహ్యంగా మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు.

Shinganamala Will that MLA also give jalak to Jagan

ఐటీ, పరిశ్రమల శాఖామంత్రిగా తన శాఖపై దృష్టి పెట్టాల్సిన ఆయన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లను విమర్శించడంతోనే సరిపెట్టారు.

తాజాగా వైసీపీలో జరుగుతున్న నియోజకవర్గ మార్పులు, చేర్పుల్లో భాగంగా అమర్నాథ్‌ను అనకాపల్లి నుంచి తప్పించారు.

అమర్నాథ్‌ స్థానంలో ఎటువంటి రాజకీయ అనుభవంలేని భరత్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించడం ఇప్పుడు కోడిగుడ్డు మంత్రికి మింగుడు పడటం లేదు.

పైగా వై.వి. సుబ్బారెడ్డి తన సమక్షంలోనే భరత్‌ను అందరికీ అనకాపల్లి ఇన్‌చార్జ్‌గా పరిచయం చేయడం ఆయనకు తీవ్ర అవమానంగా చెప్పాలి.

అదే వేదికపై ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం క్యాడర్‌ను కూడా కలిచి వేసింది. కానీ ఏం చేస్తాం.. భజన చేస్తే.. తాను మాత్రం గుడ్డలు చింపుకునే రేంజ్‌లో భజన చేస్తే జగన్‌కు మాత్రం ఇరిటేషన్‌ పుట్టదా..