ఆయన సినిమాలే కాదు.. తాట కూడా తీస్తాడట!

0
136
DillRaju does not only films he also plays tata

మహేష్‌ బాబు నటించిన ‘ఆగడు’ సినిమాలో ఒక డైలాగ్‌ ఉంది. ‘‘సమాజం మీద సినిమాల ప్రభావం బాగా ఉంది’’ అని. ఇది ముమ్మాటికీ నిజమే.

సినిమాల్లో వేషధారణ, వ్యవహారం, పంచ్‌ డైలాగ్‌లు ఇతర విషయాలు కూడా సమాజంపై చాలా ప్రభావం చూపుతాయి. సినిమా జనాలు తీసే సినిమాల వల్ల సమాజంపైనే అంత ప్రభావం పడుతుంటే..

వాళ్లపై పడకుండా ఎందుకుంటుంది. తప్పకుండా పడుతుంది. అలాంటి ప్రభావంలోనే ఉన్నారు నిర్మాత దిల్‌ రాజు ఇప్పుడు.

వెన్నెల కిషోర్‌ అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్స్‌’. ప్రముఖ రచయిత గోపీమోహన్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వి. రమణారెడ్డి నిర్మాత.

ఈ చిత్రం టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను దిల్‌రాజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాపై చిందులు తొక్కారు. రాబోయే సంక్రాంతికి సినిమాల విడుదల విషయంలో ఏర్పడ్డ వివాదంలో దిల్‌రాజు పేరు ప్రముఖంగా వినిపించింది.

దిల్‌రాజు పెద్ద చిత్రాలు (అందులోనూ ఆయన రిలీజ్‌ చేస్తున్నవి కావడంతో) విషయంలో ఒకలా, చిన్న చిత్రం ‘హను`మాన్‌’ విషయంలో ఒకలా వ్యవహరిస్తున్నారని, ఛాంబర్‌ పెద్దగా ఉంటూ ఇలా చేయడం దిల్‌రాజుకు తగదు అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

దీనికి తోడు ‘హను`మాన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి దిల్‌రాజును పొగిడినట్టూ కాకుండా.. క్లాస్‌ పీకినట్టూ కాకుండా కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

Megastar sweet warning to Dil Raju
దీంతో సోషల మీడియా మరిన్ని కథనాలతో అల్లరి చేసింది. ఈ విషయంలో రగిలిపోతున్న దిల్‌రాజు ప్రెస్‌మీట్‌లో రెచ్చిపోయారు. తన గురించి ఏది పడితే అది రాస్తే ఊరుకుంటున్నాను అనుకుంటున్నారేమో. తాట తీస్తా.

నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. సంక్రాంతికి విడుదల విషయంలో కొన్ని సినిమాలను పోస్ట్‌పోన్‌ చేయించడం అంటే మాటలా. ఎంత టెన్షన్‌ ఉంటుంది. ఒక్కోసారి నేను కూడా నా సినిమాలను పోస్ట్‌ పోన్‌ చేసుకున్నాను.

కానీ అర్ధంపర్ధం లేకుండా కొన్ని వెబ్‌సైట్‌లు ఇష్టం వస్తున్నట్లు రాస్తున్నాయి. కొన్ని ఛానళ్లు ఇష్టం వచ్చినట్టు ప్రసారం చేస్తున్నాయి. చిరంజీవిగారు నామీద గౌరవంతో చేసిన వ్యాఖ్యలను కూడా వక్రీకరించారు.

మళ్లీ ఇలా చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు.. అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఇంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత దిల్‌రాజును మీడియా వదిలేస్తుందా….