ఈ ఏడాది టాలీవుడ్ లో విడాకులు తీసుకోబోతున్న స్టార్ సెలెబ్రిటీలు వీళ్ళే!

0
537
These are the star celebrities who are going to divorce in Tollywood this year

ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాల ద్వారానే జీవితం ని సెటిల్ చేసుకున్న జ్యోతిష్యుడు వేణు గోపాల స్వామి. ఇతను కేవలం స్టార్ సెలబ్రిటీస్ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి, వాళ్ళ గురించి లేనిపోని విషయాలను చెప్తూ ఉంటాడు.

ఇతనికి సెలబ్రిటీస్ అందరూ కూడా తమ జాతకాలను, నక్షత్రాలతో సహా వివరాలు ఇచ్చినట్టుగా బిల్డప్స్ కొడుతాడు. ఇతన్ని జాతకం చెప్పమని ఎవ్వరూ అడగరు, కానీ ఇతనే చెప్తూ ఉంటాడు.

అడగకుండా నోటికి వచ్చినట్టు వాగ్దనికి ఇతనికి హక్కు ఎవరు ఇచ్చారో అర్థం కాదు. ఇతనము చెప్పేవి ఎదో చీకట్లో బాణం ఏసినట్టు రెండు మూడు జరిగాయి.

ఇక అంతే అప్పటి నుండి అదే నోరు వేసుకొని నోటికి వచ్చినట్టు చెప్పడం మొదలు పెట్టాడు. కొత్త సంవత్సరం అని కూడా చూడకుండా, మళ్ళీ కొంతమంది హీరోల వ్యక్తిగత జీవితాలపై సంచలన కామెంట్స్ చేసాడు. అవేంటో చూద్దాం.

పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య తో విడాకులు తీసుకోవాలని వైసీపీ వాళ్ళకంటే ఎక్కువ కోరుకున్నది వేణు గోపాల స్వామి అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Meena gave clarity that she broke the pot on the second marriage

ప్రతీ కొత్త సంవత్సరం లో ఈ ఏడాది పవన్ కళ్యాణ్ తన భార్య తో విడిపోతాడు అంటాడు. ఈ ఏడాది కూడా అదే పాట పాడాడు. కానీ ఒక్క ఏడాది కూడా అతను చెప్పింది జరగలేదు.

ఇక నానాలుగు సంవత్సరాల పాటు తన సొంత ఇంట్లో డేటింగ్ చేసి, అన్నీ ఓకే అనుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కూడా ఈ ఏడాది విడిపోతారు అంటూ ఒక కామెంట్ చేసాడు.

ఇంతకంటే దరిద్రం మరొకటి ఉంటుందా. చూడ ముచ్చటగా ఉన్న ఆ జంట మీద ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యాలని ఎలా అనిపించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు.

ఇవన్నీ పక్కన పెడితే అప్పుడే పుట్టిన రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా జాతకం చెప్పే హక్కుని ఇతనికి ఎవరు ఇచ్చారు?. చిన్న పసికందుకి కూడా లోపాలు ఉన్నాయి అంటూ మాట్లాడడం చూస్తే ఇతను అసలు మనిషేనా అని అనిపిస్తుంది.

బాబు గోగినేని ఒక న్యూస్ ఛానల్ లో ఇతని బాగోతాలు మొత్తం బయటపెట్టాడు, ఆ వీడియో చూస్తే ఇతను ఎంత దొంగ స్వామిజి అనేది తెలుస్తుంది.