రెండవ పెళ్లిపై కుండబద్దలు కొట్టినట్టు క్లారిటీ ఇచ్చేసిన మీనా..!

0
662
Meena gave clarity that she broke the pot on the second marriage

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందం తో పాటుగా అద్భుతమైన నటన కనబర్చే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు మీనా. ఈమె తెలుగులోనే కాదు, హిందీ , తమిళం మరియు మలయాళం భాషల్లో లో కూడా ఎంతో మంది సూపర్ స్టార్స్ సరసన నటించి పాన్ ఇండియన్ హీరోయిన్ గా నిల్చింది.

ఇప్పటికీ కూడా ఈమె మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లో కొనసాగుతుంది. రీసెంట్ గానే ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యం తో స్వర్గస్తులు అయిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఆయన చనిపోయిన దగ్గర నుండి నేటి వరకు మీనా గురించి సోషల్ మీడియా లో ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి.

మీనా పలానా డైరెక్టర్ తో పెళ్లి చేసుకోబోతుందని, పలానా హీరోని పెళ్లి చేసుకోబోతుందని,ఇలా ఎన్నో రకాల వార్తలు బయటకి వచ్చాయి. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వీటి అన్నిటికి క్లారిటీ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ ‘నా భర్త చనిపోయిన దగ్గర నుండి నేటి వరకు ఇండస్ట్రీ లో నాకు ఎంతో మందితో సంబంధాలు అంటగట్టారు సోషల్ మీడియా లో ఉండే గాసిప్ రాయుళ్లు.

Meena sensational comments on second marriage with hero Dhanush

చాలా మంది నా తమ్ముడి వయస్సు ఉన్న ధనుష్ గారితో కూడా రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం చేసారు. ఈ వార్తని చూసి మా ఇంట్లో వాళ్లంతా ఎంతో బాధపడ్డారు.

వీటి అన్నింటిపై నేను చెప్పేది ఒక్కటే. నేను ఎవరితోనూ ప్రేమలో లేను, ఎవరితోనూ డేటింగ్ చెయ్యడం లేదు, ప్రస్తుతం నాకు రెండవ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనే లేదు.

నా ద్రుష్టి మొత్తం నా కూతురుకి ఎలాంటి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి?,ఆమెకి తండ్రి లేని లోటుని ఎలా పూడవాలి అనే దానిపైనే ఉంది. అంతకు మించి నేనేమి కోరుకోవడం లేదు.

భవిష్యత్తులో నేను రెండవ పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే ఆ ఉద్దేశ్యాలు ఏమి లేవు’ అంటూ చెప్పుకొచ్చింది మీనా.

అంటే రెండవ పెళ్ళికి ఆమె సిద్దంగానే ఉంది, కానీ ఇప్పటి వరకు ఆమె మనసుకి నచ్చిన వాళ్ళు దొరకలేదు అని ఆమె మాట్లాడుతున్న మాటలని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇక మీనా కూతురు నైనా ఇది వరకే విజయ్ హీరో గా నటించిన ‘తేరి’ చిత్రం లో బాలనటిగా నటించింది. భవిష్యత్తులో ఈమెని పెద్ద హీరోయిన్ ని చెయ్యడమే మీనా లక్ష్యం అట.