అప్ కమింగ్ పాన్ ఇండియన్ సినిమాలలో 1000 కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ వీళ్ళే!

0
249
Tollywood star directors who have the power to grab 1000 crores in upcoming Pan Indian movies

ఒకప్పుడు మన సౌత్ మార్కెట్ ప్రపంచం మొత్తం మారుమోగిపోయే రేంజ్ హిట్ కొట్టాలంటే రాజమౌళి, శంకర్ లాంటి డైరెక్టర్ అవసరం అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పొయ్యాయి.

కొత్త డైరెక్టర్ సరికొత్త ఆలోచనలతో, అద్భుతమైన టేకింగ్ తో మన సౌత్ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్తున్నారు. డైరెక్టర్స్ అంటే ఇది, టాలెంట్ అంటే ఇది అని అనిపించేలా చేస్తున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి మరియు శంకర్ ని డామినేట్ చేసేస్తున్నారు. అలాంటి డైరెక్టర్స్ లో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది సందీప్ రెడ్డి వంగ గురించి.

ఆయన మన టాలీవుడ్ కి ‘అర్జున్ రెడ్డి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఎవరీ దర్శకుడు, ఇంత కొత్తగా, ఇంత బోల్డ్ గా ఈ చిత్రాన్ని తీసాడు.

రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఫార్మటు ని బ్రేక్ చేసాడే అని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇండియాలోనే మోస్ట్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు ఇప్పుడు.

‘అర్జున్ రెడ్డి’ సినిమాని హిందీ లో షాహిద్ కపూర్ తో ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసి అక్కడి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు. ఆ చిత్రం తర్వాత రణబీర్ కపూర్ తో రీసెంట్ గా ఆయన చేసిన ‘ఎనిమల్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Tollywood star heroes shaking Mumbai

సుమారుగా 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఆ చిత్రం రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఒక సినిమాని ఇంత బోల్డ్ గా తీసి హిట్ కొట్టొచ్చా అని బాలీవుడ్ ఆడియన్స్ ని నోరెళ్లబెట్టేలా చేసింది ఈ సినిమా.

ఈయన తన తదుపరి చిత్రం ‘స్పిరిట్’ తో కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొడుతాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సందీప్ వంగ తర్వాత అదే రేంజ్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యగల సత్తా సుకుమార్ కి ఉంది. ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్ తో చేస్తున్న ‘పుష్ప : ది రూల్ ‘ 2000 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఆ రేంజ్ క్రేజ్ ఉంది ఈ సినిమాకి. అలాగే రామ్ చరణ్ శంకర్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి, ప్రభాస్ ‘కల్కి’ చిత్రానికి కూడా వెయ్యి కోట్లు కొట్టే సత్తా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.