గుంటూరు కారంపై పూనమ్ సెటైర్లు.. మళ్ళీ కెలికిందిగా?

0
224
Poonam satires on Guntur Karam again

సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పూనమ్ కి ఉన్న సంబంధాలపై అప్పట్లో సోషల్ మీడియా లో పుకార్లు షికార్లు చేశాయి. పూనమ్ కి సంబందించిన ఓ ఆడియో కూడా యూట్యూబ్ వీడియోలో దర్శనం ఇస్తుంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకొని ఉండడం.. పూనంతో సంబంధాలు ఉన్నాయని పుకార్లు రావడం అప్పట్లో సంచలంగా మారాయి.

వీరి ఇరువురి మధ్య మాటల మాంత్రికుడు దర్శకుడు తివిక్రమ్ వ్యవాహారం నడిపాడని.. పూనమ్ వ్యవహారంలో నీచంగా ప్రవర్తించాడని పుకార్లు షికార్లు చేశాయి. వీటికి ఆజ్యం పోసేలా అప్పుడప్పుడు గురూజీ పేరుతో పూనమ్ కూడా అతడిపై సెటైర్లు వేస్తుంది.

ఇక తాజాగా మహేష్ బాబు హీరోగా వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనితో మరో సారి గురూజీపై ఉన్న అక్కసుని పూనమ్ వెళ్లగక్కింది. గుంటూరు కారం చిత్రం కథ ఓ నవల నుండి కాపీ కొట్టి అల్లారని వార్తలు వసున్నాయి.

Subhasree and Tasty Tejalu folded the chair

కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా ఈ సినిమాని తీశారని అభియోగాలు వస్తున్నాయి. ఇప్పటికే ఇలా నవల నుండి లైన్ తీసుకొని కథలు అల్లుతాడని త్రివిక్రమ్ పై అభియోగాలు ఉన్నాయి.

ఆఆ చిత్ర సమయంలో ఇలా చేసాడని.. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాత వాసి సినిమా కూడా హాలీవుడ్ సినిమాని కాపీ కొట్టాడని వార్తలు వచ్చాయి.

ఇక గుంటూరు కారం విషయంలో కూడా ఇలాంటి అభియోగాలు వస్తున్న నేపథ్యంలో పూనమ్ తన దైన శైలిలో స్పందించింది. అయితే డైరెక్ట్ గా అతడి పేరు చెప్పకుండా గురూజీ థింగ్స్ అంటూ సైటర్లు వేసింది పూనమ్.

అతడు ఏదైనా చేయగలడు. ఏమి చేసినా దాని బయట పడగల సమర్థుడు. అతడు చేసిన తప్పు ప్రజలకి కనిపించకుండా.. అతడికి ప్రత్యేకమైన సౌకర్యం ఉంది.

సీఎం ఆఫీస్ ని కూడా మ్యానేజ్ చేయగలడు అని.. ఇవ్వన్నీ గురూజీ థింగ్స్ అంటూ పూనమ్ ట్విట్ చేయడం విశేషం.