గుంటూరు కారం సెన్సార్ టాక్.. ఎలా ఉందొ తెలుసా?

0
188
Guntur Karam sensor talk Do you know how it is

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా తెరకి ఎక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో చేరుకున్నాయి.

మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపించడం అభిమానులని అలరిస్తుంది. ఈ సినిమా పోస్టర్ లలో మహేష్ లుక్స్ చూస్తుంటే ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని చెప్పవచ్చు.

అలానే ఇటీవల విడుదల అయిన ‘కుర్చీ మడత పెట్టి’ పాట అభిమానులని ఒక రేంజిలో అలరించింది. ఇక ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని.. జనవరి 12 న విడుదలకి సిద్ధంగా ఉంది.

సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల ఉంటుందని తొలుత ప్రకటించినా.. అదే సమయానికి మరి కొన్ని సినిమాలు వస్తుండడంతో.. ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వచ్చాయి.

అయితే తాజాగా గుంటూరు కారం చిత్రానికి సంబంధించి సెన్సార్ పూర్తి అవడంతో.. ఆ అనుమానాలు అన్ని పటా పంచలు అయ్యాయి.

దీనితో ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల అవ్వడం పక్కా అని చెప్పవచ్చు. ఈ మేరకు సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Did Trivikram repeat his magic in Guntur Karam

సెన్సార్ నుండి యూ బై ఏ సర్టిఫికెట్ జారీ అయింది. ఇక సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉందని తెలుస్తుంది.

సెన్సార్ టాక్ విన్నాక ‘చూడగానే మజా వస్తుంది. హార్ట్ బీట్ పెరుగుతుంది. ఈల వేయాలని అనిపిస్తుంది’ అని నిర్మాత నాగ వంశి ట్విట్ చేయడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది.

ఏది ఏమైనా ఈ సినిమా పూర్తి టాక్ రావాలంటే.. జనవరి 12 వరకు వేచి చూడాల్సిందే.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా హీరోయిన్ గా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇంకా ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్ తో పాటు మన శివాగామిని దేవి రమ్య కృష్ణ నటిస్తున్నారు.

ఏది ఏమైనా ఈ సంక్రాంతి కి తెలుగు సినీ ప్రేక్షకులకు మహేష్ బాబు సినిమా పండగ చేయనుందని చెప్పవచ్చు.