నిన్ను చంపుతా అంటూ ‘పూరీ’ని బెదిరించిన ఆ హీరోయిన్..!

0
1950

టాలీవుడ్ ఇండస్ర్టీలో సంచలనాలకు మరు పేరంటూ ఉంటే అది పూరీ జగన్నాథ్ అనే చెప్పాలి. ఆయన ప్రతీ సినిమా ఒక కొత్త వేరియేషన్ తో ఉంటుంది. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ ఒక స్టియిల్ అయితే ‘పోకిరీ’ మరో స్టయిల్. ఇలా ఒక మూవీతో మరో మూవీని కంపేర్ చేయలేం. ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను నీ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరూ..? అని అలీ అడిన ప్రశ్నకు పూరీ జగన్నాథ్ అని చెప్పాడు. ఇంతటి గొప్ప రైటర్ కూడా పూరీ అభిమాని అంటే ఆయన లెవల్ ఏమిటో తెలుస్తుంది. రాజమౌళి కూడా ఒక సందర్భంలో పూరీలా ఉండాలని ఉంది అన్నాడు కూడా..

ఇడియట్ లో వింత సన్నివేశం

ఇంతటి స్టార్ డైరెక్టర్ పూరీని ఒక హీరోయిన్ చంపుతానని బెదిరించిందట. ఆమె ఎవరో కాదు హీరోయిన్ రక్షిత. ఈ ముద్దుగుమ్మ పూరీ డైరెక్షన్ లో ‘ఇడియట్’ సినిమాలో హీరోయిన్ గా చేసింది. మాస్ మహరాజ్ రవితేజతో జోడీగా రక్షిత చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్టయ్యింది. 2002లో విడుదలైన ఈ సినిమాతోనే రవితేజకు మంచి స్టార్ డమ్ వచ్చింది. అప్పటి వరకూ అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న పూరీకి కూడా ఈ చిత్రం మంచి మైలురాయిగా నిలిచింది.

వార్నింగ్ ఇచ్చిన రక్షిత

ఇడియట్ సినిమాతోనే రక్షిత వెండితెరపై అరంగేట్రం చేసిందనే విషమం మనకు తెలిసిందే. ఈ మూవీలో ఒక సీన్ షూట్ చేస్తున్న సమయంలో రక్షిత పూరీని తీవ్రంగా విసిగించిందట. సీరియస్ గా చేసే ఒక సీన్ లో రక్షిత పదే పదే నవ్వుతూ చేస్తుందట. అప్పటికే ఆమె ఆ సీన్ కు ఎక్కువ టేకులు తీసుకుందట. ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో పూరీ గట్టిగా మందలించారట. నువ్వు ఇలా చేస్తే తర్వాతి చిత్రంలో నీకు ఛాన్స్ ఇవ్వను అంటూ బెదిరించారట.

దీంతో రక్షిత ‘నీ తర్వాత సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వాలి.. ఒక్కటి కాదు పది చిత్రాల్లో నేను ఉండాలి’ లేదంటే చంపేస్తా అంటూ రక్షిత స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిందట. రక్షిత స్వీట్ వార్నింగ్ కు పూరీకి నవ్వు ఆగలేదట. అప్పటి వరకూ సీన్ సరిగా చేయడం లేదన్న కోపం పోయిందట. ఈ విషయాన్ని రీసెంట్ గా పూరీ జగన్నాథ్ వెల్లడించారు.

పీకల్లోతు కష్టాల్లో పూరీ

ఏది ఏమైనా ఇప్పుడు పూరీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. సహ నిర్మాతగా మారి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో తీసిన ‘లైగర్’ డిజాస్టర్ గా నిలిచింది. తర్వాత వెంట వెంటనే ఈడీ దాడులు. ఇవన్నీ ఆయనను కొంత డీప్రెషన్ కు గురి చేశాయి. వీటన్నింటిని పెద్దగా పట్టించుకోని పూరీ అన్నయ్య చిరంజీవితో సినిమా తీసేందుకు ఒప్పించారు. చిరంజీవి, పూరీ కాంబోలో ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ సినిమాతోనైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని భావిస్తున్నారట పూరీ జగన్నాథ్