సొంత స్టూడియోలోనే అవమానాలను ఎదుర్కొన్న కృష్ణ

0
1758

నట శేఖరుడిగా గుర్తింపు పొందిని సూపర్ స్టార్ క్రిష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మూస ధోరణిలో సాగిపోతున్న సినిమాలను దారి మళ్లించిన గొప్ప నటుడు. ఆయన ప్రతి చిత్రం ఒక వైవిధ్య భరితమైన కథాంశంతో సాగిపోతుంది. విఠాలాచార్య నుంచి ఎస్ వీ కృష్ణారెడ్డి వరకూ చాలా మందితో కలిసి పని చేశారు కృష్ణ. టాలీవుడ్ ఇండస్ర్టీకి కౌబాయ్ ను పరిచయం చేసింది కూడా కృష్ణనే అంటే సందేహం లేదు.

ఆయన హీరోగానే కాకుండా దర్శకత్వం, నిర్మాణ రంగాల్లో కూడా బాగా రాణించారు. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రాలకు సంబంధించి చాలా మంది నిర్మాతలను ఆదుకున్నారు కూడా. కోట్లాది రూపాయలు సంపాదించిన క్రిష్ణ పద్మాలయ స్టూడియోను కూడా నిర్మించారు. ఈ స్టూడియో నుంచి అనేక చిత్రాలు బయటకు వచ్చాయి.

పద్మాలయలో వింత అనుభవం

కాల క్రమంలో పద్మాలయ స్టూడియోను అమ్మివేశారు కృష్ణ. ఆ డబ్బులతో మరో చోట స్థలాలను కొనుగోలు చేశారట. పద్మాలయ స్థలంలో కొంత భాగాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ లకు ఇవ్వగా, ఇప్పటికీ 5 ఎకరాల స్థలం ఇంకా పద్మాలయ స్టూడియో పేరిటే ఉంది. ఈ విషయాలను పక్కన బెడితే. ఒక సారి ఒక వింత ఘటన జరిగింది. ఆదేంటో ఇక్కడ చూద్దాం..

గుండులో గుర్తు పట్టని వాచ్ మన్

కృష్ణకు దైవభక్తి మెండుగా ఉండేది. ప్రతీ ఏటా తిరుపతికి వెళ్లేవారట. ఒక సారి తిరుపతికి వెళ్లిన కృష్ణ తలనీలాలు సమర్పించారు. అయితే అప్పట్లో కృష్ణ గారే తన కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లేవారు. ఒక సమయంలో ఆయన బయటకు వెళ్తున్న క్రమంలో కారు ట్రబుల్ ఇచ్చిందట. అయితే అది కూడా పద్మాలయ స్టూడియోకు సమీపంలోనే కావడంతో నడుచుకుంటూ స్టూడియోకు వెళ్లారట.

కృష్ణను గుర్తుపట్టని వాచ్ మన్ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదట. తలపై జుట్టు లేకుండా ఆ వాచ్ మెన్ ను కృష్ణను ఎప్పుడూ చూడలేదట. అందునా ‘మా సార్ ఎప్పటికీ కారులో వస్తారు నడిచి రారు కదా’ అనుకున్నారట అందుకే ఎట్టిపరిస్థితుల్లో లోపలికి అనుమతించలేదట.

హిందీ రాక కష్టాలు

ఇక ఆ వాచ్ మెన్ కూడా తెలుగు వాడు కాకపోవడంతో ఆయనకు హిందీలో చెప్పినా అర్థం కాకపోవడంతో ఏం చేయాలో తెలియక కృష్ణ చాలా సేపు స్టూడియో బయటే ఉన్నారట. ఇంతలో స్టూడియో మేనేజర్ బయటకు వచ్చి కృష్ణ గారిని గుర్తుపట్టి లోపలికి తీసుకెళ్లారట. ఇలా తన సొంత స్టూడియోలోనే తనను అనుమతించకపోవడం అనే వార్త అప్పట్లో వైరల్ గా మారింది.

వాచ్ మెన్ తీరుపై మొదట్లో కొంచెం కోపం వచ్చనా ఆయన పని తీరును చూసి మురిసిపోయారట కృష్ణ. చాలా సంవత్సరాలు ఆయననే పనిలో పెట్టుకున్నారట. ఆయన కుటుంబానికి కూడా ఆర్థికంగా సాయం చేశారట కృష్ణ. అంతటి గొప్ప మనిషి కృష్ణ అంటే. కానీ ఈ విషయం తెలియని చాలా మంది సొంత స్టూడియోలోనే కృష్ణను అవమానించారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.