మోక్షజ్ఞ సినిమాకు మోక్షం ఉందా

0
264
nandamuri mokshagna

ఎంత కాదన్నా టాలీవుడ్‌లో వారసత్వం చాలా కామన్‌. అప్పుడప్పుడు వార్తల్లోకి ఎక్కే ఈ వారసత్వం.. చాపకింద నీరులా ఎప్పడూ తనపని తాను చేసుకుపోతూనే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోల లిస్ట్‌ చెబితే అందులో దాదాపు 50శాతం మంది నందమూరి, అక్కినేని, కొణిదెల, ఘట్టమనేని కుటుంబాలకు చెందిన వారే కనిపిస్తారు.

ఇందులో నందమూరి వారసుల్లో పెద్దాయన నట వారసులుగా బాగా క్లిక్‌ అయింది మాత్రం బాలయ్య, జూనియర్‌ ఎన్టీఆర్‌లు అని చెప్పక తప్పదు. తెలుగు సినిమాల్లోకి నందమూరి వారి మూడోతరం ఎప్పుడో ఎంటర్‌ అయిపోయినా ఒక్క జూనియర్‌ యన్టీఆర్‌ తప్ప ఎవరూ నిలదొక్కుకోలేదు.

nandamuri mokshagna

ప్రభాస్ ‘సలార్’ మూవీ మొట్టమొదటి రివ్యూ

ఈ క్రమంలోనే నందమూరి వారి మరో మూడోతరం కథానాయకుడిగా బాలయ్య ముద్దుల కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అదిగో ఆ డైరెక్టర్‌తో మోక్షజ్ఞ సినిమా అంటే.. ఇది ఈ డైరెక్టర్‌తో మోక్షజ్ఞ సినిమా అంటూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి.

దీనికి కొనసాగింపుగా బాలయ్య ఏ దర్శకుడి సినిమా చేస్తే.. ఆ దర్శకుడికి మోక్షజ్ఞ సినిమాను బాలయ్య అప్పగించారు అంటూ క్షణాల్లో వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఈ కోవలోకి తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా వచ్చి చేరారు. కొద్ది రోజులుగా ఈవార్త మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

బాలయ్య తన కుమారుణ్ణి రాజమౌళి చేతుల్లో పెట్టాడని, అతన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో లాంచ్‌ చేయాలని రాజమౌళికి ఆదేశాలు జారీ చేశారని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ పసలేని వార్తలని కొట్టిపారేస్తున్నారు సినీ విశ్లేషకులు.

రాజమౌళి ప్రస్తుతం మహేష్‌బాబుతో చేస్తున్న సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మొదలై, పూర్తవడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టవచ్చునని తెలుస్తోంది. అంటే రాజమౌళి కొత్త సినిమా చేయాలంటే 2 సంవత్సరాలు ఆగాలి.

ఒకవేళ మహేష్‌ సినిమా తర్వాత రాజమౌళి మోక్షజ్ఞ సినిమా టేకప్‌ చేసినా అది ప్రీ ప్రొడక్షన్‌, షూటింగ్‌ పూర్తికి మరో 2 సంవత్సరాలు ఈజీగా పడతాయి. అంటే మొత్తంగా 4 నాలుగు సంవత్సరాలు అన్నమాట.

ఇప్పటికే నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యమైపోతోందని బాధపడుతుంటే ఇంకో నాలుగు సంవత్సరాలు ఆగడం జరిగేపని కాదు. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న దర్శకులతో బాలయ్య పని కానిచ్చే అకాశం ఉంది. వీరిలో అనీల్‌ రావిపూడికి ఎక్కువ అవకాశం ఉంది.