కేవలం ఒక్క థియేటర్ నుండి 40 వేల డాలర్లు.. మొదలైన ‘గుంటూరు కారం’ ప్రభంజనం!

0
358

మరో 10 రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ తో మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమా తెరకెక్కబోతుంది అనే వార్త వచ్చినప్పుడే ఈ సినిమా పై ఆడియన్స్ లో క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగింది.

గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘అతడు’ మరియు ‘ఖలేజా’ వంటి క్లాసిక్ చిత్రాలు వచ్చాయి. ఇవి రెండు కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా కూడా నేటి తరం ఆడియన్స్ కి ఒక రేంజ్ లో నచ్చిన సినిమాలు అని చెప్పొచ్చు.

అందుకే ఈ కాంబినేషన్ సినిమా అంటే కళ్ళు మూసుకొని బయ్యర్స్ 160 కోట్ల రూపాయలకు థియేట్రికల్ బిజినెస్ చేసారు. ఇక ఆ తర్వాత ప్రమోషనల్ కంటెంట్ కూడా అదిరిపోవడం తో ఆడియన్స్ లో అంచనాలు ఇంకా కాస్త పెరిగింది.

Mega power star Ram Charan in Dhoom 4 An exciting update for fans

ఇక రీసెంట్ గా విడుదలైన ‘కుర్చీ మడత పెట్టి’ అనే సాంగ్ సోషల్ మీడియా ని ఏ రేంజ్ లో ఊపేస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అసలే సంక్రాంతి, పైగా మాస్ కమర్షియల్ సినిమా, అందులో ఇలాంటి సాంగ్స్ ఉంటే మాస్ సెంటర్స్ ఏ రేంజ్ లో ఊగిపోతాయో ఊహించుకోవచ్చు.

అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ అమెరికా లో ప్రారంభించారు.

అక్కడ డల్లాస్ సినీ మార్క్ ఐమాక్స్ అనే థియేటర్ లో గుంటూరు కారం ప్రభంజనం సృష్టించింది. విడుదలకు పది రోజుల ముందే ఆ థియేటర్ లో 40 వేలకు పైగా డాలర్స్ ని రాబట్టి చరిత తిరగరాసింది.

ఎందుకంటే ఇప్పటి వరకు #RRR మరియు సలార్ వంటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ కి కూడా ఈ రేంజ్ ట్రెండ్ లేదు.

కేవలం ‘గుంటూరు కారం’ కి మాత్రమే ఈ ట్రెండ్ కనిపించింది. మహేష్ బాబు ఓవర్సీస్ లో బాగా స్ట్రాంగ్. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఓవర్సీస్ మార్కెట్ లో కింగ్ అని చెప్పొచ్చు.

ఈ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది గుంటూరు కారం ట్రెండ్. ఇక పూర్తి స్థాయి బుకింగ్స్ ప్రారంభిస్తే ఏ రేంజ్ ఉంటుందో మీరే ఊహించుకోండి.