ద్యేవుడా.. రెండు రోజుల్లో 100 కోట్లు దాటేసింది

0
737

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో విడుదల అయిన ‘పుష్ప’ చిత్రం విడుదల అయిన తోలి రోజున మిక్సడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే నెగెటివ్ టాక్ నే ఎక్కువా సొంతం చేసుకున్న కూడా కలెక్షన్ లలో మాత్రం దుమ్ము లేపుతుంది. తోలి రోజు ఏకంగా రూ.71 కోట్ల గ్రాస్ ని రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. 2021 లో ఇండియాలో విడుదలైన చిత్రాలలో తోలి రోజు ఎక్కువ కలెక్షన్ లు విడుదల చేసిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీనిని ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించడం విశేషం. కాగా ఈ చిత్రం తోలి రెండు రోజుల్లో 100 కోట్లు దాటేసింది.

రెండు రోజుల్లో దుమ్ములేపిన ‘పుష్ప’ కలెక్షన్లు

ట్రేడ్ ఎనలిస్ట్ రమేష్ బాల ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ లో వెల్లడించారు. రమేష్ బాల ట్విట్టర్ లో “పుష్ప చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లో 100 కోట్లు గ్రాస్ ని రాబట్టింది” అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సుకుమార్ సినిమాలు నిదానంగా ప్రజల్లోకి వెళతాయని ఒక నానుండి ఉంది. అదే కనుక జరిగితే.. ఈ చిత్రం ముందు ముందు మరిన్ని వసూళ్లు సాధించి కొత్త రికార్డు లు సృష్టించే అవకాశం లేకపోలేదు. ఈ చిత్రానికి సీక్వెల్‌ గా ‘పుష్ప’ పార్ట్‌-2 కూడా విడుదల కానుంది. రెండో పార్ట్ అక్టోబర్ లో విడుదల చేస్తామని డైరెక్టర్ సుకుమార్ తెలిపారు.

ఆ సీన్ తొలగించాలి ఫిక్స్‌ అయ్యారట

కాగా.. ఈ సినిమాలో ఒక సీన్ లో అల్లు అర్జున్ తన వ్యాన్‌ లో కూర్చొని హీరోయిన్ భుజంపై చేయి వేసి.. ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఈ సీన్ లో హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ పై పడినట్లు అనిపిస్తుంది. ఈ సీన్ అభిమానులతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచం ఇబ్బంది గా మారింది. ఈ సీన్ కి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై విమర్శలు రావడంతో ఆ సీన్ తొలగించాలి ఫిక్స్‌ అయ్యారట చిత్ర యూనిట్. ఆదివారం నుంచి సీన్‌ లేకుండా పుష్ప మూవీ కొనసాగుతుంది.