బాలయ్య క్వశ్చన్ కు.. ఆ పొలిటీషన్స్ గుటకలు

0
273

ఓ వైపు సినిమాలు, మరో వైపు ఓటీటీ షోలతో బాలయ్య బాబు జోరు పెరుగుతూనే ఉంది. వీరసింహా రెడ్డి షూటింగ్‌లో పాల్గొంటూనే ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2’ రెండో సిజన్ లో కూడా హోస్ట్ గా మెరిపిస్తున్నాడు. ఇటీవలే సీజన్ 2 ఆహా ఓటీటీలో స్ర్టీమింగ్ అయ్యింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్. సురేశ్ రెడ్డి, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తో కలిసి షోలో సందడి బాలయ్య మాజీ సీఎం, మాజీ స్పీకర్ ఇద్దరు కూడా బాలయ్యబాబు చిన్ననాటి స్నేహితులు కావడం. ఇక రాధిక ఆయన సమకాలీన నటి కావడంతో ముగ్గురితో బాలయ్య సందడి ఓటీటీలో సందడి చేసింది.

నాలుగో ఎపీసోడ్ విశేషాలు

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సురేశ్ రెడ్డితో తన స్కూల్, కాలేజ్ డేస్ ను పంచుకున్నారు బాలకృష్ణ. వారు కాలేజ్ డేస్ లలో మంచి క్రికెటర్స్ కావడంతో అప్పుడు ఉన్న విషయాలను పంచుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయాలు షోకు హైలట్ గా నిలవగా. తర్వత వచ్చిన రాధికతో సినీ ముచ్చట్లతో పాటు అప్పటి హీరోలు వారిపై ఆమెకున్న అభిప్రాయాలు తదితరాల గురించి తెలుసుకుంటూనే పర్సనల్ విషయాలను టచ్ చేశారు బాలకృష్ణ. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రవేశం, అందులో వచ్చిన కొన్ని ట్విస్ట్ లను రివీల్ చేశారు.

ఏదో ఒక రూముకు వెళ్లాను

బాలయ్యను రాధిక అడిగిన ఒక క్వశ్చన్ ‘ఆ రోజు ఆ హోటల్ లో నీ రూములో ఉండకుండా ఏ రూములో ఉన్నావు’ అంటూ అడుగగా బాలయ్య కూడా స్పాంటేనియన్ గా సమాధానం చెప్పడం నవ్వు తెప్పించింది. పరిస్థితులకు అనుకూలంగా ఏదో ఒక రూముకు వెళ్లాను అని చెప్పడంతో ప్రేక్షకులు చప్పట్లతో నవ్వుకున్నారు. ఎపీసోడ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇద్దరు రాజకీయ నాయకులు ఒక నటి డిఫరెంట్ వేలో సాగే అన్ స్టాపబుల్ కు ప్రొఫెసన్స్ వేరైనా ఒక్క స్టేజీపై వారు సందడి చేయడాన్ని ప్రేక్షకులు స్వాగతించారు.

వచ్చే ఎపీసోడ్ లో ఏం ఉండబోతోంది

బాలయ్య బాబు ‘అన్ స్టాపబుల్ ఎన్ బీకే 2’ కొత్త వెర్షన్ తో దూసుకుపోతోంది. ఇందులో ఐదో ఎపీసోడ్ కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేసింది ‘ఆహా’. ప్రోమోనే ఆద్యంతం ఆసక్తిని పెంచింది. ఇందులో ఇద్దరు స్టార్ నిర్మాతలు వారితో పాటు ఒక స్టార్ దర్శకుడు బాలయ్యతో సందడి చేయనున్నారు. దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్ తో పాటు దర్శకధీరుడు రాఘవేందర్ రావు ఈ పెపీసోడ్ లో కనిపించబోతున్నారు.

ఇద్దరు నిర్మాతలతో పాటు డైరెక్టర్ తో బాలకృష్ణ కు ఉన్న బంధం అంతా ఇంతా కాదు. ముద్దురితో కలిసి బాలయ్య నటించారు. సీనియర్ ఎస్టీఆర్ తోనూ హిట్ మూవీలు తీశారు దర్శకేంద్రుడు రాఘువేందర్ రావు. సీనియర్ ఎన్టీఆర్, రాఘువేందర్ రావు కాంబోలో వచ్చిన చాలా మూవీస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్లుగా నిలిచిపోయాయి.