చిరంజీవి పై కేసు వేసినందుకు మన్సూర్ అలీ ఖాన్ కి లక్ష రూపాయిలు జరిమానా విధించిన చెన్నై హై కోర్టు!

0
353
megastar chiranjeevi case mansoorali

‘లియో’ చిత్ర నటుడు మన్సూర్ అలీ ఖాన్ ప్రముఖ హీరోయిన్ త్రిష పట్ల అసభ్యంగా మాట్లాడి పెను దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాకు డైరెక్టర్ లోకేష్ త్రిష తో రేప్ సన్నివేశాలను రాస్తాడని అనుకున్నాను, కానీ రాయలేదు, అది నాకు చాలా బాధ కలిగించింది.

త్రిష తో అలాంటి పాత్రలు చెయ్యాల్సి వస్తే నా అదృష్టం గా భావిస్తాను అంటూ మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు త్రిష చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

megastar chiranjeevi case mansoorali

వర్మ వ్యూహానికి కోర్టు బ్రేక్‌

ఇలాంటి మనిషి ఉన్న సమాజం లో ఉండాలంటేనే చిరాకు వేస్తుంది అంటూ త్రిష తన ట్విట్టర్ ఖాతా ద్వారా మన్సూర్ అలీ ఖాన్ పై తీవ్రంగా విరుచుకుపడింది.

త్రిష కి సపోర్ట్ గా మన్సూర్ అలీ ఖాన్ ని తిడుతూ కోలీవుడ్ మొత్తం అండగా నిలబడింది. ఇక మన టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి త్రిష కి సపోర్ట్ చేస్తూ మన్సూర్ అలీ ఖాన్ పై విరుచుకుపడ్డారు.

దీనికి మన్సూర్ అలీ ఖాన్ తెగ ఫీల్ అయిపోయాడు. నా వెర్షన్ కూడా వినాలి కదా, అది వినకుండా నాపై చిరంజీవి అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తాడు?, ఆయన మాట్లాడిన మాటలకు నా పరువుకు భంగం కలిగింది, కాబట్టి నేను పరువు నష్టం దావా వేస్తాను అంటూ మన్సూర్ అలీ ఖాన్ త్రిష , చిరంజీవి మరియు కుష్బూ పై చెన్నై హై కోర్టు లో పిటిషన్ వేసాడు.

ఈ పిటిషన్ ని విచారించిన తర్వాత కోర్టు మన్సూర్ అలీ ఖాన్ పై చివాట్ల వర్షం కురిపించింది. ఇది పరువు నష్టం దావా వేసినట్టు లేదు, నీకు పబ్లిసిటీ జరగడం కోసం వేసినట్టు ఉంది. గతం లో కూడా ఇలా చాలా సార్లు చేసావు, నీ మానసిక స్థితి సరిగా లేదనుకుంటా, కోర్టు సమయం ని అనవసరంగా వృధా చేసినందుకు లక్ష రూపాయిలు జరిమానా విధిస్తు మన్సూర్ అలీ ఖాన్ కి కోర్టు నోటీసులు ఇచ్చింది.

కోర్టు ఇచ్చిన ఈ తీర్పు పై సోషల్ మీడియా లో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇలాంటి పబ్లిసిటీ పిచ్చి ఉన్నవాళ్లకు ఇదే సరైన శిక్ష అంటూ ప్రశంసిస్తున్నారు.

మన్సూర్ అలీ ఖాన్ ఆడవాళ్ళ పై ఇంత అసభ్యంగా మాట్లాడడం, తిరిగి వాళ్ళు కౌంటర్ ఇస్తే దానికి రెచ్చిపోయి ఇలా పిచ్చివాడిలాగా ప్రవర్తించడం కొత్తేమి కాదు. ఎన్నో సార్లు గతం లో జరిగాయి.