విజయ్ లియో చిత్ర ఓపెనింగ్స్ ని దాటలేకపోయిన ప్రభాస్ ‘సలార్’

0
384
Leo Vs Salaar Openin Day Collections

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం సలార్ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి, కానీ ఎందుకో ఆశించిన స్థాయి ఓపెనింగ్ మాత్రం దక్కలేదనే ఫీలింగ్ అందరిలో కలిగింది.

సినిమా విడుదల వాయిదా పడినప్పుడే ఈ చిత్రానికి ఆడియన్స్ లో అప్పటి వరకు ఉన్న బజ్ మరియు హైప్ బాగా తగ్గిపోయిందా?, అందుకే సినిమాకి అనుకున్న రేంజ్ ఓపెనింగ్ రాలేదా వంటి సందేహాలు అభిమానుల్లో మెలుగుతున్నాయి.

Leo Vs Salaar Openin Day Collections

‘సలార్’ దెబ్బకి ‘డుంకీ’ ఆ ఫేమస్ థియేటర్ నుండి అవుట్!

కేజీఎఫ్ సిరీస్ లాంటి సంచలన విజయం తర్వాత, ప్రశాంత్ నీల్ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నాడు అంటే కచ్చితంగా భారీ అంచనాలు ఉండడం సహజం. ఓపెనింగ్స్ విషయం లో అయితే ఇండియా లో అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ మొత్తం స్మాష్ అవుతాయని అంచనాలు పెట్టుకోవడం లో ఎలాంటి తప్పు లేదు.

‘సలార్’ చిత్రం ఓపెనింగ్స్ విషయం లో ఆ అంచనాలను అందుకోలేకపోయింది..ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలలో ఒకటి తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో’ చిత్రం. ఈ సినిమాకి తమిళం తో పాటుగా తెలుగు, కన్నడ మరియు మలయాళం భాషల్లో సరిసమానమైన క్రేజ్ ఉంది.

అందుకే మొదటి రోజు దాదాపుగా 147 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ రికార్డుని బద్దలు కొట్టే సత్తా కేవలం ‘సలార్’ కి మాత్రమే ఉందని అనుకున్నారు ట్రేడ్ పండితులు. కానీ సలార్ దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. ఇది కాస్త ట్రేడ్ కి నిరాశే. ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ ఇద్దరూ కూడా విజయ్ కంటే పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫేమ్ మరియు క్రేజ్ ఉన్న వాళ్ళు.

అలాంటి వారి వల్లనే లియో రికార్డు బద్దలు అవ్వలేదంటే ఆ సినిమా ఓపెనింగ్ పవర్, విజయ్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పైగా సలార్ చిత్రానికి లియో కంటే సూపర్ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అయినప్పటికీ కూడా లియో ని అందుకోకపోవడం గమనార్హం.

ఫుల్ రన్ లో లియో చిత్రం దాదాపుగా 620 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘సలార్’ ఆ గ్రాస్ ని అధిగమిస్తుందో లేదో చూడాలి. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కచ్చితంగా లియో ని క్రాస్ చేస్తుందని అనుకుంటున్నారు ట్రేడ్ పండితులు.