ప్రభాస్ కు మూవీకి మూడో హీరోయిన్ గా ఆమె

0
261

టాలీవుడ్ లో క్రేజ్ లో దూసుకుపోతున్న స్టార్ ప్రభాస్. ఆయన మారుతీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం ‘ఆది పురుష్’తో షూటింగ్ బిజీలో ఉన్న ఆయన తన తర్వాతి ప్రాజెక్టును డైరెక్టర్ మారుతి తో చేయనున్నారు. మారుతి ఎక్కువగా కామెడీ బేస్డ్ స్టోరీస్ కు ప్రాధాన్యత ఇస్తారు. ఈ కథ కూడా ఆ కోవలేకే వస్తుందని చెప్పారు.

కామెడీ బేస్డ్ కథతో ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. ఆయన ఎంచుకునే ప్రాజెక్టులు కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి. బాహుబలి సీక్వెల్ నుంచి ఆయన క్రేజ్ ఇండియా వ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్ గా దూసుకుపోయింది. ఆయన తీసిన ప్రతీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై కలెక్షన్లలో దూసుకుపోతున్నాయి. ఇటీవల ‘రాథేశ్యామ్’తో కొంత డిజాస్టర్ ఎదుర్కొన్నా తట్టుకొని ‘ఆది పురుష్’తో దాన్ని ఫిల్ చేయనున్నట్లు తెలుస్తుంది. మారుతీతో కలిసి చేస్తున్న ప్రాజెక్టు కామెడీ బేస్డ్ కథతో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

మారుతీతోనే నెక్స్ట్ మూవీ

‘పీపుల్ మిడియా ఫ్యాక్టరీ’ నుంచి మారుతీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కిస్తుండగా కథ పరంగా ముగ్గురు హీరోయిన్లు అవసరం అవుతారట. అందుకు ఇప్పటికే ఇద్దరికి సెలక్ట్ చేసిన చిత్ర యూనిట్ మూడో హీరోయిన్ కోసం వెతుకుతున్నాట. ఇందులో భాగంగా మూడో హీరోయిన్ కూడా ఫైనల్ అయ్యిందని యూనిట్ తెలిపింది.

థర్డ్ హీరోయిన్ గా రిధి కుమార్

స్టోరీ పరంగా ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తాడు. అందులో ఇద్దరు నిధి అగర్వాల్ కాగా, రెండో ప్లేస్ లో మాళవికా మోహన్ ఉన్నారు. ఇప్పుడు మూడో హీరోయిన్ గా రిధి కుమార్ ను ఎంపిక చేశారు. రిధి ‘లవర్’ సినిమా ద్వారా ఇండస్ర్టీకి పరిచయం అయ్యారు. ‘రాధేశ్యామ్’లో కూడా ఆమె నటించారు.

వచ్చే నెలలో సెకండ్ షెడ్యూల్

డైరెక్టర్ మారుతి ప్రభాస్ కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది అంటాడు మారుతి. ఆయన కోసమే ఈ కథను ఎంపిక చేసుకున్నానని. ఈ స్టోరీ కొత్త కోణంలో అందరినీ అలరిస్తుందని చెప్పాడు మారుతి. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ వచ్చే నెల (డిసెంబర్)లో ఉంటుందని మారుతి చెప్పాడు.

ప్రభాస్ బిజే కారణం

ప్రస్తుతం వరుసగా వస్తున్న ప్రాజెక్టుల్లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ‘సలార్’, ఓం రౌత్ తో కలిసి ‘ఆది పురుష్’ చిత్రాల్లో నటిస్తున్నాడు. తర్వాత ‘ప్రాజెక్ట్ కే’, ‘స్పిరిట్’ కూడా వరుసలోనే ఉన్నాయి. ఈ చిత్రాలతో పాటే మారుతి చిత్రంలో కూడా చేస్తున్నారట ప్రభాస్. రెబల్ స్టార్ వరుస సినిమాల కోసం ఆయన అభిమానులు ఎదురు చేస్తున్నారు. భారీ ప్రాజెక్టులతో పాటు కామెడీ మూవీ కూడా చేయడంపై ఫ్యాన్స్ నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.