తల్లి మాట నిలబెట్టిన ఇనయా, చివరి కేప్టెన్ గా విజయం

0
300

బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ కు చేరుకుంటుండగా కంటెస్టెంట్ ఆట రసవత్తరంగా మారుతోంది. ఇక ఫైనల్ విజేతపై సంకేతాలు వస్తున్నా బిగ్ బాస్ ఎటు తీసుకెళ్తాడో అన్న డైలామాలో ఉన్నారు ప్రేక్షకులు. బిగ్ బాస్ హౌజ్ చివరి కేప్టెన్ ను హౌజ్ మేట్స్ శుక్రవారం (నవంబర్ 25)న ఎన్నుకున్నారు.

హౌజ్ మేట్స్ బాస్ గా ఇనయా

తల్లి కోరికతో పాటు తన కలను కూడా నిజం చేసుకుంది ఇనయా. బిగ్ బాస్ హౌజ్ కేప్టెన్ కోసం సాగిన రసవత్తర పోటీలో విజయం సాధించి హౌజ్ మేట్స్ కు కొత్త బాస్ గా మారింది. ఫ్యామిలీ వీక్ లో వచ్చిన తన తల్లి సైతం ఆమెను ఇదే కోరిక కోరింది. ఏదో ఒక వారం కేప్టెన్ అయితే గొప్పేముంది ఫైనల్ లో కేప్టెన్ అయితే విన్నర్ గా నిలవచ్చు అనుకుందేమోనంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సెమీ ఫైనల్ కు చేరిన ఫస్ట్ కంటెస్టెంగ్ గా నిలిచి గ్రేట్ అనిపించుకుంది. ఇనయా తల్లి కోరిక మేరకు ఫైనల్ విజేత కూడా అవుతుందా..? చివరి వరకూ వేచి చూడాలి మరి.

శ్రీసత్యపై అక్కడక్కడా పైచేయి

ప్రస్తుతం హౌజ్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో గడిచిన ఎపీసోడ్స్ లో అందరూ కేప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నవారే. కొందరు రెండు సార్లు కూడా కేప్టెన్ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులో ఇనయా, రోహిత్ మినహాయింపు కాగా. ఈ వారం ఇనయా కేప్టెన్ గా నిలిచింది. కేప్టెన్ ఎన్నుకునేందుకు నిర్వహించిన పోటీలో అందరూ ఇనయాకే ఓటేశారు. దీని కోసం నిర్వహించిన గేమ్ లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అయ్యారు. చివరగా ఇనయా, శ్రీసత్య గేమ్ లో ఉన్నారు. వీరి మధ్య గట్టి పోటీ నడిచింది. ఇద్దరూ కూడా టాస్క్ పూర్తి చేసేందుకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇనయా శ్రీసత్యపై అక్కడక్కడా పైచేయి సాధించింది.

నేరుగా ఫైనల్ కు

వచ్చే వారంతో బీగ్ బాస్ కు ఎండ్ పడబోతుండడంతో ఎలాగైనా ఒక్కసారైనా కేప్టెన్ గా ఉండాలని పట్టుదలతో విజయం సాధించింది ఇనయా. బిగ్ బాస్ 6 ఫైనల్ కు చేరుకుంటుండడంతో ఈ వారం కేప్టెన్ గా విజయం సాధిస్తే ఫైనల్ బెర్త్ కన్ఫాం అని భావించి అందరూ టైట్ పర్ఫామ్స్ ఇచ్చారు. చివరికి ఇనయా సుల్తానా గెలిచి ఫైనల్ బెర్త్ రిజర్వ్ చేసుకుంది. ఒక్క అడుగు దూరంలోనే ఇనయా ఉండనే చెప్పాలి.

తల్లి కోరిక తీరుస్తుందా

ఫ్యామిలీ వీక్ లో హౌజ్ లోకి ఇనయా తల్లి వచ్చి ఆమెను ఎంకరేజ్ చేసింది. ఈ క్రమంలో ఫైనల్ విజేత నువ్వే కావాలంటూ చెప్పింది. ఇప్పటి వరకూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చావని విజేత కూడా నువ్వే అంటూ చెప్పి వెళ్లిపోయింది. తల్లి కోరికను ఇనయా నెరవేరుస్తున్నట్లే కనిపిస్తుంది. కేప్టెన్ కావడం, ఫైనల్ వీక్ లో బెర్త్ కన్ఫాం చేసుకోవడంపై వ్యూవర్స్ కూడా సంతోషంగా ఉన్నారు. ఇది అటుంచితే హౌజ్ లో మళ్లీ రగడ మొదటైంది. గేమ్ ఎలిమినేషన్ విషయంలో రేవంత్, ఫైమా మధ్య వివాదం రాజుకుంది. కీర్తి తనకు వేలు బాగా లేదని అందుకే వెనుబడ్డానని బాధపడింది. ఇక రోహిత్ విషయానికి వస్తే కేప్టెన్ కాలేకపోయానని ఫీలై ఏడ్చేశాడు కూడా.