జపాన్ లో తెగ చేసేస్తున్న మన సినిమా.. బాహుబలి కి మించి రికార్డులు

0
261

జపాన్ లో మన టాలీవుడ్ డబ్ మూవీ కలెక్షన్లలో దూసుకుపోతోంది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 300 మిలియన్ యన్ (జపాన్ కరెన్సీ)లను వసూలు చేసి బాహుబలి రికార్డులను తిరిగరాసింది. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా.. జపాన్ భాషలో ఇటీవల మన టాలీవుడ్ మూవీ ‘త్రిపుల్ ఆర్(RRR)’ను అక్టోబర్ 21న అక్కడ విడుదల చేసింది చిత్ర యూనిట్. డైరెక్టర్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యామిలీతో వెళ్లి మరీ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. రిలీజైన తక్కువ సమయంలోనే భారీగా వసూళ్లు చేసింది ఈ మూవీ.

మన సినిమాలకు యమ క్రేజ్

జపనీయులు మన ఇండియన్ సినిమాలను తెగ చూసేస్తారు. అక్కడ మన హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంటుంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా నటించిన ‘ముత్తు’కు జపనీయులు అక్కడ ఘన విజయం తెచ్చిపెట్టారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా’ను కూడా విరగబడి మరీ చూశారు. త్రిపుల్ ఆర్ కంటే ముందు బాహుబలి సీక్వెల్ ను కూడా ఆదరించారు. అక్కడ రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ మంచి ఇమేజ్ ఉంది. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన మరో మూవీని అక్కడ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించి విడుదల కూడా చేసింది. దానిని కూడా జపనీయులు హత్తుకున్నారు. కలెక్షన్ల వర్షం కురిపించారు.

34 రోజుల్లో 300 యన్లు

బాహుబలికి మంచి కలెక్షన్లు సాధించిపెట్టారంటే మన చిత్రాలపై వారికి ఉన్న ప్రేమ ఎంతటిదో అర్థం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ‘త్రిపుల్ ఆర్’ రూ. 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ చేసింది. జపాన్ లో అత్యధిక వసూలు చేసిన రెండో సినిమాగా ఇప్పుడు త్రిపుల్ ఆర్ నిలిచింది. బాహుబలి సీక్వెల్ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. జపాన్ వ్యాప్తంగా 209 థియేటర్లు, 31 ఐమాక్స్ స్ర్కీన్స్ లో ఈ మూవీ విడుదలైంది. కేవలం 34 రోజుల్లో 300 మిలియన్ యన్ లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా ఘటత కెక్కింది. (300 యన్ లు ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 17.9 కోట్లు).

రికార్డు తిరిగరాసింది త్రిపుల్ ఆర్

ఇప్పటి వరకూ ఈ చిత్రాన్ని 2,40,000 మందికిపైగా చూశారని అక్కడి సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటి వరకూ 300 మిలియన్ యన్ లు సాధించి బాహుబలి మొదటి స్థానంలో ఉండగా, 305 మిలియన్ యన్ లు సాధించి (ఇంకా ప్రదర్శన కొనసాగుతోంది) రికార్డు తిరిగరాసింది త్రిపుల్ ఆర్. సంవత్సరం పాటు జపనీయులను మెప్పించిన ‘ముత్తు’ 400 మిలియన్ యన్ లు(రూ. 23.5 కోట్లు) సంపాదించి మొదటి స్థానంలో నిలవగా దాని తర్వాతి స్థానంలో అనతి కాలంలోనే త్రిపుల్ ఆర్ నిలిచింది. ఇలాగే ఇంకొన్ని రోజులు ప్రదర్శన కొనసాగితే ముత్తు రికార్డులను కూడా బద్దలు చేస్తుంది.

మరో 100 మిలియన్ యన్ లు సాధ్యమే

విడుదలైన (అక్టోబర్ 21)న 34 రోజుల్లోనే 300 మిలియన్ యన్ లు సాధించిన ఈ చిత్రం అనతి కాలంలో మరో 100 మిలియన్ యన్ లను సాధించడం కష్టమైన పనేమి కాదు. అక్కడ సినిమాలు సుధీర్ఘ కాలం ప్రదర్శనకు ఉంటాయి. బాహుబలి 2 దాదాపు 6 నెలల వరకూ ఆడింది. ఈ నేపథ్యంలో బాహుబలి మరో 100 మిలియన్ యన్ కలెక్షన్ వసూలు చేస్తుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే జపాన్ లో బాక్సాఫీస్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో టాప్ త్రీలో టాలీవుడ్ సినిమాలే ఉంటాయి.